భారత్​ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి-suicide attack on army camp in j k s rajouri kills 3 soldiers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్​ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

భారత్​ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

Sharath Chitturi HT Telugu
Aug 11, 2022 09:15 AM IST

Suicide attack on army camp : భారత సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు.

<p>భారత్​ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి</p>
భారత్​ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి (ANI/file)

Suicide attack on army camp : జమ్ముకశ్మీర్​లోని భారత సైన్యానికి చెందిన శిబిరంపై గురువారం తెల్లవారుజామున ఆత్మహుతి దాడి జరిగింది. రజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిబిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటనలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఇదే ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సైతం మరణించారు.

రజౌరీ జిల్లా దర్హల్​ ప్రాంతంలోని సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడి సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. వారి చర్యలను సైన్యం ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు- భద్రతాదళాల మధ్య ఎన్​కౌంటర్​ సంభవించింది.

"కొందరు ఉగ్రవాదులు.. పార్గల్​ ఆర్మీ క్యాంప్​ ఫెన్స్​ను దాటేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు సెంట్రీ కాల్పులు జరిపారు. అనంతరం ఎన్​కౌంటర్​ మొదలైంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు," అని ఆడేజీపీ ముకేశ్​ సింగ్​ వెల్లడించారు.

ఈ ఆత్మహుతి దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు సైన్యం అనుమానిస్తోంది.

పుల్వామా జిల్లాలో 25కేజీల ఐఈడీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఒక రోజు వ్యవధిలో ఈ ఆత్మహుతి దాడి జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో.. ఈ ఘటనలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్