Karnataka bandh: రేపు కర్నాటకలో రాష్ట్రవ్యాప్త బంద్; ఉబర్, ఓలాలు కూడా బంద్ కు మద్ధతు
Karnataka bandh: కర్నాటకలో శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ జరగనుంది. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో కన్నడ అనుకూల వర్గాల గ్రూప్ ఈ బంద్ నకు పిలుపునిచ్చింది.
Karnataka bandh: రేపు కర్నాటకలో అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో కన్నడ అనుకూల వర్గాల గ్రూప్ ‘‘కన్నడ ఒక్కుట (Kannada Okkuta)’’ ఈ బంద్ ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ బంద్ కు రాష్ట్రంలోని దాదాపు 1900 సంస్థలు మద్ధతు ఇస్తున్నాయి.
ఉదయం 6 నుంచి..
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వచ్ఛంధంగా ఈ బంద్ లో పాల్గొనాలని ‘‘కన్నడ ఒక్కుట (Kannada Okkuta)’’ గ్రూప్ నాయకులు పిలుపునిచ్చారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో ఇప్పటికే బెంగళూరు లో మంగళవారం బంద్ నిర్వహించారు. తాజాగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బంద్ లో భాగంగా బెంగళూరులో శుక్రవారం ఉదయం టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఉబర్, ఓలాలు కూడా బంద్
ఈ బంద్ కు టాక్సీ సేవలను అందించే ఉబర్, ఒలా సంస్థలు కూడా మద్ధతు ప్రకటించాయి. ఈ బంద్ కు మద్ధతుగా స్వయంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. అందువల్ల శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉబర్, ఓలా టాక్సీ సేవలు అందుబాటులో ఉండవు. శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు రోడ్లపైకి రావద్దని తమ డ్రైవర్లకు ఇప్పటికే సూచించామని ఆ సంస్థలు తెలిపాయి. అలాగే, బెంగళూరులో నాయంద హళ్లి నుంచి టౌన్ హాల్ వరకు ఉబర్, ఓలా ల డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నాయి.
ఇవన్నీ బంద్
కన్నడ సంఘాల బంద్ సందర్భంగా బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. హైవేలపై, టోల్ గేట్స్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించి, వాహనాల రాకపోకలను అడ్డుకోనున్నారు. ఉద్యోగులు శుక్రవారం వర్క్ ఫ్రం హోం చేయాల్సిందిగా ఇప్పటికే పలు సంస్థలు ఆదేశాలిచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులు యథావిధిగా పని చేస్తాయి. రెస్టారెంట్లు,
రజినికాంత్ సినిమా
తమిళ సినీ సూపర్ స్టార్ రజినీ కాంత్ కర్నాటకకు రావద్దని, ఆయన సినిమాలను కూడా రాష్ట్రంలో ప్రదర్శించనివ్వబోమని ‘‘కన్నడ ఒక్కుట’’ నాయకులు చెబుతున్నారు. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేస్తే, తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కర్నాటక ప్రభుత్వాన్ని హెచ్చరించారు.