Sonia Gandhi | 'సమస్యలను అధిగమిస్తాం.. ఇదే మా సంకల్పం'-sonia gandhi says we will overcome at congress chintan shivir ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sonia Gandhi | 'సమస్యలను అధిగమిస్తాం.. ఇదే మా సంకల్పం'

Sonia Gandhi | 'సమస్యలను అధిగమిస్తాం.. ఇదే మా సంకల్పం'

HT Telugu Desk HT Telugu
May 15, 2022 05:14 PM IST

Sonia Gandhi Chintan Shivir | 'సమస్యలను మనం అధిగమిస్తాం.. మనం అధిగమిస్తాం.. మనం అధిగమిస్తాం,' అంటూ చింతన్​ శిబిర్​లో తన ప్రసంగాన్ని ముగించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అంతకుముందు.. భారత్​ జోడో యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు.

<p>సోనియా గాంధీ</p>
సోనియా గాంధీ (ANI)

Sonia Gandhi Chintan Shivir | రాజస్థాన్​ వేదికగా జరిగిన చింతన్​ శిబిర్​లో ప్రసంగించారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. 'సమస్యలను అధిగమిస్తాం.. ఇదే మా సంకల్పం,' అంటూ ప్రేక్షకులను ఉత్తేజపరిచారు.

"చింతన్​ శిబిర్​ చాలా ఉపయోగపడింది. మీలో చాలా మందికి మీ మనసులో మాటలను చెప్పుకునే అవకాశం లభించింది. చాలా నిర్మాణాత్మకంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆరు బృందాల్లో జరిగిన చర్చల సారాంశం నాకు లభించింది. అవి చాలా ఉపయోగపడతాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోల కోసం వాటిని వాడుకోవచ్చు. ఇక్కడికి వస్తే.. నా కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపినట్టు అనిపించింది. సమస్యలను మనం అధిగమిస్తాం.. మనం అధిగమిస్తాం.. మనం అధిగమిస్తాం. ఇదే మా సంకల్పం," అంటూ తన ప్రసంగాన్ని ముగించారు సోనియా గాంధీ.

ఈ క్రమంలో.. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించినట్టు సోనియా గాంధీ వెల్లడించారు. మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా.. దేశవ్యాప్తంగా 'భారత్​ జోడో యాత్ర' చేపట్టనున్నట్టు తెలిపారు.

నవ సంకల్పానికి ఆమోదం..

Congress Chintan Shivir | ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ దారుణ ప్రదర్శన చేసింది. చాలా రాష్ట్రాల్లో కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ క్రమంలోనే పార్టీకి పునర్​వైభవాన్ని తీసుకొచ్చేందుకు హైకమాండ్​ సిద్ధపడింది. ఉదయ్​పూర్​లో మూడురోజుల పాటు చింతన్​ శిబిర్​ను నిర్వహించింది. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలతో పాటు, సమాజం, ప్రజల సమస్యలు, బీజేపీ పాలనపై కాంగ్రెస్​ నేతలు సమాలోచనలు చేశారు.

చింతన్​ శిబిర్​ చివరి రోజైన ఆదివారం నాడు.. 'నవ సంకల్ప్​' తీర్మానాన్ని కాంగ్రెస్​ ఆమెదించింది. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారీ సంస్కరణలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం