SIDBI Officers Recruitment 2024: ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి-sidbi officers recruitment 2024 apply for 72 grade a and b posts at sidbiin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sidbi Officers Recruitment 2024: ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి

SIDBI Officers Recruitment 2024: ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి

Sudarshan V HT Telugu

SIDBI Recruitment: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) లో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సిడ్బీ అధికారిక వెబ్ సైట్ sidbi.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ

ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సిడ్బీ అధికారిక వెబ్ సైట్ sidbi.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 72 గ్రేడ్ ఎ, గ్రేడ్ బి పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 8
  • దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 2
  • ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ 1): డిసెంబర్ 22
  • ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ 2): జనవరి 19, 2025
  • ఇంటర్వ్యూ తాత్కాలిక షెడ్యూల్: ఫిబ్రవరి 2025

ఖాళీల వివరాలు

వయోపరిమితి

గ్రేడ్ ఎ ఆఫీసర్: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 21 సంవత్సరాల పైబడి, 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. (08.11.1994 నుంచి 09.11.2003 మద్య జన్మించి ఉండాలి.

గ్రేడ్ బి ఆఫీసర్: ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 25 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక

ఎంపిక ప్రక్రియలో ఫేజ్ 1 (మొత్తం 200 మార్కులకు ఏడు (7) విభాగాలతో కూడిన ఒక పేపర్ తో కూడిన ఆన్ లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్), ఫేజ్ 2 (మొత్తం 200 మార్కులకు రెండు పేపర్లతో కూడిన ఆన్ లైన్ పరీక్ష), ఫేజ్ 3 (100 మార్కుల ఇంటర్వ్యూ, ఇందులో ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ (జిల్లా/ రాష్ట్ర/ జాతీయ స్థాయి)లో చెప్పుకోదగ్గ సాధనకు 25% మార్కులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజుగా ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.175/ చెల్లించాలి. ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ.1100 చెల్లించాలి. డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డు/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/ మొబైల్ వ్యాలెట్ల ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు సిడ్బీ అధికారిక వెబ్ సైట్ sidbi.in. లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించండి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.