తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Scheme : ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు - ఎంపిక విధానం ఇలా..!
- TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటన చేసింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
- TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటన చేసింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 6)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ స్కీమ్ పై లోతుగా చర్చ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి… స్కీమ్ అమలుపై కీలక ప్రకటన చేశారు.
(2 / 6)
ఈ దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్ల మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు.
(3 / 6)
రాజకీయ పార్టీలకు అతీతంగా.. కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన అర్హులను, పేద వారిని గుర్తించి ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు.
(4 / 6)
దీపావళి(అక్టోబర్ 31) రోజు అమావాస్య ఉంది… అయితే ఆ తర్వాత మంచిరోజు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ భేటీ తర్వాత వెల్లడించారు. ఆ దిశగా కసరత్తు జరుగుతోందని వివరించారు.
(5 / 6)
కేబినెట్ భేటీ కంటే ముందు.. అధికారులతో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి అధికారులతో భేటీ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను పరిశీలించారు. యాప్‌లో ఒకటి రెండు మార్పు చేర్పులను మంత్రి సూచించారు. వచ్చే వారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
(6 / 6)
లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తోంది. పారదర్శకంగా చేయాలని చూస్తోంది. ఇక ఈ స్కీమ్ ను మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇతర గ్యాలరీలు