SBI SCO Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ (SBI SCO Recruitment) 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 4, 2024 తో ముగుస్తుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లోని డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్బీఐ (state bank of india)లో 1497 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను (రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, వయస్సు రుజువు, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), పిడబ్ల్యుబిడి సర్టిఫికేట్ (వర్తిస్తే), విద్యార్హత, ఇతర అర్హతలు, అనుభవం మొదలైనవి) అప్ లోడ్ చేయాలి, లేనిపక్షంలో వారి దరఖాస్తు / అభ్యర్థిత్వం ఆన్లైన్ రాత పరీక్ష / షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూకు పరిగణించరు.
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలి. ఇవి కనీసం ఈ రిక్రూట్మెంట్ (recruitment) ఫలితాలు ప్రకటించే వరకు, తుది ఎంపికపై కాల్ లెటర్లు జారీ చేసే వరకు యాక్టివ్ గా ఉండాలి. కాల్ లెటర్/ఇంటర్వ్యూ కు సంబంధించిన వివరాలను అభ్యర్థులు ఆ ఈ మెయిల్, మొబైల్ నంబర్ ల ద్వారా పొందుతారు. అర్హతలు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి.