SBI Recruitment 2024: ఎస్బీఐ లో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్-sbi sco recruitment 2024 apply for 150 trade finance officer posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Recruitment 2024: ఎస్బీఐ లో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

SBI Recruitment 2024: ఎస్బీఐ లో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jun 12, 2024 12:28 PM IST

SBI SCO Recruitment 2024: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 టీఎఫ్ఓలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ జూన్ 27.

ఎస్బీఐ జాబ్స్
ఎస్బీఐ జాబ్స్ (HT File)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 150 'ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్, మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ - స్కేల్ 2' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హతలతో పాటు అవసరమైన అనుభవం ఉన్న అభ్యర్థులు sbi.co.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27.

పోస్టింగ్ కోసం సూచించిన ప్రదేశాలు హైదరాబాద్, కోల్కతా. అయితే ఎంపికైన అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా నియమించవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది.

అర్హతలు

విద్య: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. సర్టిఫికెట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్స్ (CDCS) సర్టిఫికేషన్ లేదా సర్టిఫికెట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్ లేదా సర్టిఫికెట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

అనుభవం: ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో సూపర్ వైజర్ హోదాలో ఎగ్జిక్యూటివ్ గా ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో కనీసం రెండేళ్ల అనుభవం (పోస్ట్ అకడమిక్ క్వాలిఫికేషన్).

నైపుణ్యాలు: అద్భుతమైన కమ్యూనికేషన్, ప్రజంటేషన్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు ఉండాలి.

ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2024: ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో, మొదట అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత, వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. షార్ట్ లిస్ట్ చేయడానికి అవసరమైన ప్రమాణాలను నిర్ణయించడానికి బ్యాంక్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత, తగిన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రౌండ్లో 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికకు మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు సాధిస్తే వారి వయసును బట్టి ర్యాంకులు ఇస్తామని బ్యాంక్ తెలిపింది.

Whats_app_banner