SBI CBO recruitment 2023: ఎస్బీఐ లో భారీ రిక్రూట్మెంట్; 5280 పోస్ట్ ల భర్తీ; అర్హత డిగ్రీ మాత్రమే..
SBI CBO recruitment 2023: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్‌మెంట్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచి, అంటే నవంబర్ 22 వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.
SBI CBO recruitment 2023: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22, బుధవారం నుంచి ప్రారంభమవుతుంది.
Last date: లాస్ట్ డేట్
ఎస్బీఐ (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 12. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్ష 2024, జనవరి లో జరుగుతుంది.
vacancy details: వేకెన్సీ వివరాలు
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికిి అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD)తో సహా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. మెడికల్, ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.
selection: వయో పరిమితి, ఇతర అర్హతలు
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికిి అభ్యర్థుల వయస్సు, ఈ సంవత్సరం అక్టోబర్ 31 నాటికి, 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపులు వర్తిస్తాయి. అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
selection: ఎంపిక
ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ డిస్క్రిప్టివ్ టెస్ట్ సమాధానాలను కంప్యూటర్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇది 4 విభాగాలతో, మొత్తం 120 మార్కులకు ఉంటుంది. ప్రతి విభాగానికి ప్రత్యేక సమయం ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వ్యవధి 30 నిమిషాలు. ఇది మొత్తం 50 మార్కులకు రెండు ప్రశ్నలతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ మరియు ఎస్సే) పరీక్ష ఉంటుంది.