Sunak mulls restrictions on foreign students:యూకేలో విదేశీ విద్యార్థులపై ఆంక్షలు-rishi sunak mulls restrictions on foreign students to curb migration
Telugu News  /  National International  /  Rishi Sunak Mulls Restrictions On Foreign Students To Curb Migration
బ్రిటన్ పీఎం రుషి సునక్ (ఫైల్ ఫొటో)
బ్రిటన్ పీఎం రుషి సునక్ (ఫైల్ ఫొటో) (AFP)

Sunak mulls restrictions on foreign students:యూకేలో విదేశీ విద్యార్థులపై ఆంక్షలు

26 November 2022, 14:59 ISTHT Telugu Desk
26 November 2022, 14:59 IST

Restrictions on foreign students in UK: దేశంలోకి రికార్డు స్థాయిలో వలసలు పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ పీఎం రుషి సునక్ భావిస్తున్నారు. ఒకవేళ రుషి సునక్ ఆ నిర్ణయం తీసుకుంటే, అది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Restrictions on foreign students in UK: విదేశీ విద్యార్థులకు సంబంధించి పలు ఆంక్షలు విధించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రికార్డు స్థాయిలో దేశంలోకి 5 లక్షల వలసలు చోటు చేసుకున్నట్లుగా అధికారిక గణాంకాలు చూపుతున్న నేపథ్యంలో కొత్త ప్రధాని రుషి సునక్ ఈ దిశగా ఆలోచిస్తున్నారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.

Restrictions on foreign students in UK: ఇవే ఆ ఆంక్షలు

విదేశీ విద్యార్థులు లో క్వాలిటీ డిగ్రీలు చేయడం కోసం బ్రిటన్ రావడంపైన, అలాగే, డిపెండెంట్లను తీసుకురావడంపైన ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే లో క్వాలిటీ’ డిగ్రీని నిర్వచించాలన్న మీడియా ప్రశ్నకు ఆ అధికార ప్రతినిధి సమాధానమివ్వలేదు.

Restrictions on foreign students in UK: విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింపు

దేశంలోని విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని రుషి సునక్ ఆలోచిస్తున్నారని ఇప్పటికే బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇందులో భాగంగా.. బ్రిటన్ లోని టాప్ యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై ఆంక్షలు విధించడంపై, దేశంలోని విదేశీ విద్యార్థుల డిపెండెంట్లకు ఇచ్చే వీసాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టారని వెల్లడించాయి. విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను తీసుకురావడంపై ఇప్పటికే బ్రిటన్ హోం మంత్రి స్యూయెలా బ్రేవర్మన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి, వృద్ధి రేటులో మెరుగుదలకు వలసలు కీలకమని బ్రిటన్ ఆర్థిక మంత్రి జెరెమి హంట్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలగని విధంగా వలసలను తగ్గించేందుకు దీర్ఘకాలిక వ్యూహం అవసరమని సూచించారు.