British PM Sunak in ‘Asian Rich List’: ఆసియన్ రిచ్ లిస్ట్ లో సునక్, అక్షత మూర్తి
British PM Sunak in ‘Asian Rich List’: బ్రిటన్ ప్రధానమంత్రి రుషి సునక్, ఆయన భార్య అక్షత మూర్తి యూకేలోని అత్యంత సంపన్నులైన ఆసియన్ల(UK's 'Asian Rich List 2022') జాబితాలో స్థానం సంపాదించారు.
British PM Sunak in ‘Asian Rich List’: 2022 సంవత్సరానికి గానూ యూకే లోని అత్యంత సంపన్న ఆసియన్ల జాబితాలో బ్రిటన్ పీఎం రుషి సునక్, ఆయన భార్య అక్షత మూర్తి తొలిసారి స్థానం సంపాదించారు.
British PM Sunak in ‘Asian Rich List’: టాప్ లో హిందూజాలు
ఏటా ప్రచురించే ఈ జాబితాలోకి రుషి సునక్ తో పాటు ఆయన భార్య, టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తి కూడా తొలిసారి అడుగుపెట్టారు. 790 మిలియన్ పౌండ్ల సంపదతో ఈ జాబితాలో వారు 17వ స్థానం సంపాదించారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్త సంపద సుమారు 113.2 బిలియన్ పౌండ్లు. గత సంవత్సరం కన్నా ఇది 13.5 బిలియన్ పౌండ్లు అధికం. ఈ జాబితాలో ఈ సంవత్సరం కూడా హిందూజా కుటుంబం అగ్ర స్థానంలో ఉంది. వారు టాప్ లో ఉండడం ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం. 2022లో వారి సంపద 30.5 బిలియన్ పౌండ్లు. గత సంవత్సరం కన్నా ఇది 3 బిలియన్ పౌండ్లు అధికం.
British PM Sunak in ‘Asian Rich List’: 24వ వార్షిక ఆసియన్ బిజినెస్ అవార్డ్స్
2022 సంవత్సరానికి గానూ యూకేలోని సంపన్న ఆసియన్ల జాబితాను బుధవారం రాత్రి లండన్ లోని వెస్ట్ మినిస్టర్ పార్క్ ప్లాజాలో జరిగిన 24వ వార్షిక ఆసియన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం ఈ జాబితాను హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్ హిందూజా కూతురు రీతూ ఛాబ్రియాకు లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ అందజేశారు.
British PM Sunak in ‘Asian Rich List’: తొలి బ్రిటిష్ ఆసియన్ పీఎం
అక్టోబర్ 25న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రిషి సునక్.. బ్రిటన్ కు తొలి బ్రిటిష్ ఆసియన్ పీఎం గా రికార్డు సృష్టించారు. అంతేకాదు, ఆయన గత 210 సంవత్సరాల బ్రిటన్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధాని కూడా. అలాగే, బ్రిటన్ పీఎం బాధ్యతలు స్వీకరించిన తొలి హిందువు కూడా కావడం విశేషం.