Somvati Amavasya | సోమవతి అమావాస్య వేళ హరిద్వార్‌కు పోటెత్తిన భక్తులు..
Somvati Amavasya | ఉత్తరాఖండ్ హరిద్వార్ వీధులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. సోమవతి అమావాస్య సందర్భంగా.. రికార్డు స్థాయిలో 35లక్షల మంది భక్తులు హరిద్వార్‌ను సందర్శించారు!
Somvati Amavasya | సోమవతి అమావాస్య సందర్భంగా.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. రెండేళ్ల కొవిడ్ అంతరాయం అనంతరం.. సోమవతి అమావాస్య జరుగుతుండటంతో గంగా ఘాట్లలో రికార్డుస్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
మేళా కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ప్రకారం.. దేశ నలుమూలల నుంచి 35లక్షలకుపైగా మంది భక్తులు హరిద్వార్‌కు వెళ్లారు. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు.. భ్రహ్మకుండ్, హర్కీపౌరిలను దర్శించుకుంటున్నారు.
ఉదయం 10 గంటల వరకు.. ఏకంగా 22లక్షల మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే రికార్డు. కాగా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. గంగా సభ కమిటీ సభ్యులు.. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆ ప్రాంతం అంతటా వాలెంటీర్లను ఏర్పాటు చేశారు.
"రెండేళ్ల కొవిడ్ సంక్షోభం అనంతరం.. ఈసారి సోమవతి అమావాస్యకు భక్తులు భారీగా తరలివచ్చారు. హర్కిపౌరికి వెళ్లే రోడ్లు అన్ని కిటకిటలాడిపోతున్నాయి," అని ధర్మశాల సమితి ప్రధాన కార్యదర్శి వికాస్ తివారి వెల్లడించారు.
భారీ భద్రతా ఏర్పాట్లు..
హరిద్వార్‌కు భక్తులు పోటెత్తడంతో.. ఎన్‌హెచ్-58 వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనాలు అనేక గంటలపాటు ముందుకు కదలలేని పరిస్థితి.
Haridwar Somvati Amavasya | భక్తుల తాకిడితో హరిద్వార్‌లోని హోటళ్లు, ధర్మశాలలు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్లు, రూమ్‌ల కొరత తీవ్రంగా ఉందని సమాచారం.
సోమవతి అమావాస్య సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అధికారులు తగిన చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యల్లో పోలీసులను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో స్నిఫర్ డాగ్స్ చేత తనిఖీలు చేయిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్