Rajya Sabha: తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ-rajya sabha elections for 12 vacant seats on september 3 election commission ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajya Sabha: తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ

Rajya Sabha: తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ

HT Telugu Desk HT Telugu
Aug 07, 2024 04:28 PM IST

Rajya Sabha elections: ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వాటిలో తెలంగాణలోని ఒక స్థానం కూడా ఉంది. పలువురు సభ్యులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నిక కావడంతో పలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు (PTI)

Rajya Sabha elections: రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు సిట్టింగ్ సభ్యులు లోక్ సభకు ఎన్నిక కావడంతో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఆగస్ట్ 14న నోటిఫికేషన్

రాజ్యసభ ఎన్నికలకు ఆగస్టు 14న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి రాజ్యసభ స్థానానికి సెప్టెంబర్ 3న వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని ఈసీఐ ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వ తేదీ వరకు గడువు ఉంది.

ఈ రాష్ట్రాల్లో..

రాజ్యసభలో ఖాళీగా ఉన్న, సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్న మొత్తం 12 సీట్లలో అస్సాం, బిహార్, మహారాష్ట్రల నుంచి 2 చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.