Amit Shah jibes Rahul Gandhi: ‘ఫారిన్ టీ షర్ట్ తో ఏకతా యాత్రనా?’
Amit Shah jibes Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యాత్ర చేసేముందు భారత దేశ చరిత్ర చదువుకొమ్మని ఎద్దేవా చేశారు.
Amit Shah jibes Rahul Gandhi: బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాజస్తాన్ లో పర్యటించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సొంత గడ్డ జోధ్ పూర్లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై , ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు.
Amit Shah jibes Rahul Gandhi: రూ. 41 వేల టీ షర్ట్
ఖరీదైన విదేశీ టీ షర్ట్ వేసుకుని రాహుల్ గాంధీ భారత్ ను ఏకం చేసే యాత్ర చేపట్టారని అమిత్ షా ఎద్దేవా చేశారు. గతంల పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని అమిత్ షా గుర్తు చేశారు. రాహుల్ బాబా గతంలో పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్ ఒక దేశమే కాదన్నారు. వేల మంది త్యాగ ఫలాలతో భారత దేశం ఏర్పడిన విషయం ఆయనకు తెలియదు. అందుకే రాహుల్ బాబాకు సలహా ఇస్తున్న.. దేశాన్ని ఏకం చేయాలని బయల్దేరే ముందు, ముందుగా భారతదేశ చరిత్ర చదువుకో`` అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Amit Shah jibes Rahul Gandhi: కాంగ్రెస్ జీరో
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ జీరో అవుతుందని షా జోస్యం చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని, 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ సంఖ్య జీరో అవుతుందని వ్యాఖ్యానించారు. రాజస్తాన్ లో సొంతంగా, చత్తీస్ ఘఢ్ లో జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.