Bharat Jodo Yatra : 4000 కిలోమీటర్లు.. 140 రోజులు- భారత్​ జోడో యాత్ర హైలైట్స్​ ఇవే!-rahul gandhi s bharat jodo yatra to end today see all the highlights of yatra here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Yatra : 4000 కిలోమీటర్లు.. 140 రోజులు- భారత్​ జోడో యాత్ర హైలైట్స్​ ఇవే!

Bharat Jodo Yatra : 4000 కిలోమీటర్లు.. 140 రోజులు- భారత్​ జోడో యాత్ర హైలైట్స్​ ఇవే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 30, 2023 07:29 AM IST

Bharat Jodo Yatra to end today : భారత్​ జోడో యాత్రకు నేటితో శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో యాత్ర హైలైట్స్​ ఇక్కడ తెలుసుకుందాము.

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ (Imran Nissar)

Bharat Jodo Yatra to end today : కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "భారత్​ జోడో యాత్ర"పైనే ఇప్పుడు చర్చంతా! ఎన్ని సమస్యలు ఎదురైనా.. యాత్రను విజయవంతంగా ముగించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. తోటి కాంగ్రెస్​ శ్రేణులకు.. తనలోని కొత్త రాహుల్​ను పరిచయం చేశారు. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని పెంపొందించారు. ఇక నేటితో భారత్​ జోడో యాత్రకు శుభం కార్డు పడనుంది. ఈ క్రమంలో.. భారత్​ జోడో యాత్రలోని కొన్ని హైలైట్స్​ను ఓసారి చూద్దాం..

యాత్ర.. రాహుల్​ గాంధీ.. కాంగ్రెస్​..

ఈ భారత్​ జోడో యాత్ర సెప్టెంబర్​ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 140కురోజులకు పైగా.. దాదాపు 4వేల కి.మీలు సాగింది ఈ యాత్ర. జమ్ముకశ్మీర్​లో సోమవారం జరగనున్న ఈవెంట్​తో యాత్రకు శుభం కార్డు పడనుంది. ఆదివారం శ్రీనగర్​లో.. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్​ గాంధీ.. తన జీవితంలో ఈ భారత్​ జోడో యాత్రకు ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు.

Rahul Gandhi Bharat Jodo Yatra : యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు రాహుల్​ గాంధీ. కేవలం 5 నెలలలోపే ఇవి జరగడం విశేషం. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, హరియాణా, ఢిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, హిమాచల్​ ప్రదేశ్​, జమ్ముకశ్మీర్​ ప్రాంతాలను చుట్టేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత.

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. దేశంలోని కీలక విపక్ష నేతలు సైతం రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు. పీడీపీ చీఫ్​ మెహ్​బూబా ముఫ్తీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ లీడర్​ ఒమర్​ అబ్దుల్లాలు.. భారత్​ జోడో యాత్ర చివరి దశలో పాల్గొన్నారు. దిగ్గజ సినీ నటుడు, ప్రముఖ రాజకీయ నేత కమల్​ హాసన్​ సైతం.. ఢిల్లీలో భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు. యాత్ర.. మహారాష్ట్రలో ఉండగా.. శివసేన నేత ఆదిత్య ఠాక్రే సైతం రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు. సెప్టెంబర్​లో.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ కూడా యాత్రలో పాల్గొన్నారు.

Bharat Jodo Yatra Congress : రాజకీయ నేతలే కాదు.. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​, సినీ నిర్మాత పూజా భట్​, బాలీవుడు నటులు స్వరా భాస్కర్​, సుశాంత్​ సింగ్​, రష్మి దేశాయ్​, అంకుషా పూరితో పాటు అనేకమంది రాహుల్​తో కలిసి నడిచారు.

యాత్రతో కాంగ్రెస్​ పరిస్థితి మారేనా?

ఓవైపు భారత్​ జోడో యాత్ర జరుగుతుంటే.. మరోవైపు దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అవి గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​. 2022 గుజరాత్​ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ప్రదర్శన చేసింది! పార్టీకి కేవలం 17 సీట్లే దక్కాయి. ఓట్ల శాతం 27కు పడిపోయింది. 2017లో కాంగ్రెస్​.. 77 సీట్లను వెనకేసుకుది. నాడు ఓట్ల శాతం 41గా ఉండేది. ఇక హిమాచల్​ ప్రదేశ్​లో హోరాహోరీగా సాగిన పోరులో విజయం సాధించింది కాంగ్రెస్​. 40 సీట్లల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విజయంలో రాహుల్​ గాంధీ పాదయత్ర కూడా కీలక పాత్ర పోషించిందని అనేకమంది కాంగ్రెస్​ నేతలు వ్యాఖ్యానించారు.

Bharat Jodo Yatra today : జనవరిలో "మూడ్​ ఆఫ్​ ది నేషన్​ పోల్​" పరుతో ఓ సర్వే జరిగింది. రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. ప్రజల దృష్టిని ఆకర్షించిందని ఆ సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా భారత్​ జోడో యాత్రకు మంచి స్పందన లభించిందని 37శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ యాత్ర కాంగ్రెస్​కు పనిచేయదని వారు పేర్కొన్నారు! భారీ స్థాయిలో ప్రజలను కనెక్ట్​ అయ్యేందుకు భారత్​ జోడో యాత్ర ఉపయోగపడిందని 29శాతం మంది అభిప్రాయపడ్డారు. రాహుల్​ గాంధీ బ్రాండ్​, ఇమేజ్​ను పెంచుకోవడం కోసమే ఈ యాత్ర పనిచేసిందని మరో 13మంది తెలిపారు. ఈ యాత్రతో కాంగ్రెస్​లో ఎలాంటి మార్పులు ఉండవని మరో 9మంది భావించారు.

బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్​ ఎదురు దాడి!

భారత్​ జోడో యాత్రలో ఉన్న రాహుల్​ గాంధీపై బీజేపీ నిత్యం విమర్శల వర్షం కురిపించింది. భారత్​ జోడో యాత్రను.. "భారత్​ తోడో యాత్ర"గా అభివర్ణిస్తూ వచ్చింది. రాహుల్​ గాంధీ వేసుకున్న దుస్తులు, ఆయన గడ్డంపైనా ఆరోపణలు చేసింది. ఆయన వేసుకున్న టీ-షర్ట్​ ఖరీదు రూ. 41వేలని ఆరోపించింది. అందుకు బదులుగా.. "మోదీ వేసుకునే సూట్​ ధర రూ. 10లక్షలు" అని విమర్శించింది కాంగ్రెస్​. గడ్డంతో ఉన్న రాహుల్​ గాంధీ.. మాజీ నియంత సద్దామ్​ హుస్సేన్​తో పోల్చారు అసోం సీఎం, కాంగ్రెస్​ మాజీ చీఫ్​ హిమంత బిశ్వ శర్మ.

Bharat Jodo Yatra live : భారత్​ జోడో యాత్రలో పలు అపశ్రుతులు కూడా చోటుచేసుకున్నాయి. పంజాబ్​లో యాత్ర సాగుతుండగా.. రాహుల్​ గాంధీ పక్కనే ఓ కాంగ్రెస్​ ఎంపీ గుండెపోటుతో కుప్పకూలారు. అనంతరం ఆయన మరణించారు. మహారాష్ట్ర నాందేడ్​లో యాత్ర సాగిన వేళ ఓ కాంగ్రెస్​ సేవా దళ్​ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. నాందేడ్​లో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. తమిళనాడుకు చెందిన 62ఏళ్ల వ్యక్తిని ఓ ట్రక్​ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన మరణించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం