Kamal Haasan : ‘హే రామ్​ సినిమా అందుకే తీశా’- రాహుల్​ గాంధీతో కమల్​ హాసన్​-rahul gandhi and kamal haasan talks about the challenges india is facing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rahul Gandhi And Kamal Haasan Talks About The Challenges India Is Facing

Kamal Haasan : ‘హే రామ్​ సినిమా అందుకే తీశా’- రాహుల్​ గాంధీతో కమల్​ హాసన్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 02, 2023 01:53 PM IST

Kamal Haasan Rahul Gandhi interview : ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్​ హాసన్​- కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీకి సంబంధించిన ఇంటర్వ్యూను ఆ పార్టీ విడుదల చేసింది. చైనాతో పాటు పలు కీలక అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు.

కమల్​ హాసన్​- రాహుల్​ గాంధీ
కమల్​ హాసన్​- రాహుల్​ గాంధీ

Kamal Haasan Rahul Gandhi interview : జాతిపిత మహ్మాత్మా గాంధీకి క్షమాపణలు చేప్పేందుకే 'హే రామ్​' అనే సినిమాను తీసినట్టు ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్​ హాసన్​ వెల్లడించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్​ విడుదల చేసింది. మహాత్మా గాంధీత పాటు దేశ రాజకీయాలు, చైనా, సినిమాలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

హత్య చేయడం అనేది చాలా నీచమైన పనిగా అభివర్ణించారు కమల్​ హాసన్​.

Kamal Haasan Hey Ram movie : "మా నాన్న కాంగ్రెస్​ సభ్యుడు. కానీ నేను పెరిగిన పర్యావరణం కారణంగా.. చాలా కాలం మహాత్మా గాంధీని విమర్శించేవాడిని. 24-25ఏళ్ల వయస్సు వచ్చేసరికి.. మహాత్ముడి గురించి మరింత లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఏళ్లు గడిచేసరికి నేను మహాత్ముడికి అభిమానిగా మారిపోయాను. మహాత్ముడికి క్షమాపణలు చెప్పేందుకే హే రామ్​ అనే సినిమా తీశాను. ఒకరిని హత్య చేయడం అనేది అత్యంత నీచమైన విషయం," అని కమల్​ హాసన్​ రాహుల్​ గాంధీకి చెప్పారు.

మహాత్మా గాంధీని 1948 జనవరిలో గాడ్సే హత్య చేశాడు. ఈ వ్యవహారంపై తనదైన శైలిలో హే రామ్​ అనే చిత్రాన్ని తీశారు కమల్​ హాసన్​. ఓ వ్యక్తి.. గాంధీపై ఎలా కోపం పెంచుకున్నాడు? గాంధీని చంపాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? కానీ చివర్లో గాంధీకి అభిమానిగా మారి.. తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అన్నదే ఈ హే రామ్​ చిత్రం కథ.

Rahul Gandhi Bharat Jodo Yatra : దేశంలో మతసామరస్యం అంశంపైనా రాహుల్​ గాంధీతో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు కమల్​ హాసన్​. "కావాలని అనిశ్చితిని సృష్టిస్తే తప్ప.. శాంతి అనేది ఎప్పుడూ ఉంటుంది. కేరళ వంటి ప్రాంతాలకు వెళితే.. శాంతి ఉంటుంది. మనం డిస్టర్బ్​ చేస్తేనే ప్రశాంతత ఉండదు. ఇది కేవలం హిందు- ముస్లిం విషయం కాదు. బహుళత్వంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని గ్రహించాలి," అని కమల్​ హాసన్​ అన్నారు.

ఈ క్రమంలో భారత్​-చైనా సరిహద్దు వివాదంపై రాహుల్​ గాంధీ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు కమల్​ హాసన్​.

Kamal Haasan Bharat Jodo Yatra : "ఈ 21వ శతాబ్దంలో భద్రత విషయంలో మన ఆలోచనలు అంతర్జాతీయంగా ఉండాలి. ఇక్కడే మన ప్రభుత్వం తప్పు చేసిందని నేను అనుకుంటాను. సరిహద్దులో ఏం జరుగుతోందో మనం వింటూనే ఉంటాము. మన భూభాగం నుంచి 2000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుంది. అయినా మనం ఏం చేయలేకపోయాము. ఏం అనలేకపోయాము. చైనా మన సరిహద్దుల్లో తిష్టేసుకు కూర్చుందని మిలిటరీ చెబుతోంది. కానీ ఎవరూ రాలేదని ప్రధాని చెబుతున్నారు. ఇవన్నీ చూసే చైనాకు ఓ విషయం అర్థమవుతుంది. 'మనం ఏమైనా చేయొచ్చు. ఏం చేసినా ఇండియా స్పందించదు,' అని చైనా భావిస్తుంది," అని రాహుల్​ గాంధీ అన్నారు.

కాంగ్రెస్​ చేపట్టిన భారత్​ జోడో యాత్రలో కమల్​ హాసన్​ పాల్గొన్నారు. డిసెంబర్​ 24న ఢిల్లీలో.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు. వీరిద్దరు ఫొటోలు వార్తలకెక్కాయి.

WhatsApp channel

సంబంధిత కథనం