Rahul Gandhi: ‘ఎన్‍ఫీల్డ్ బైక్‍లు నచ్చవు, కార్లపై ఇంట్రెస్ట్ లేదు’: తన ఫేవరెట్ బైక్ ఏదో చెప్పిన రాహుల్ గాంధీ-dont like enfields congress top leaders rahul gandhi reveals name of his favorite bike ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dont Like Enfields Congress Top Leaders Rahul Gandhi Reveals Name Of His Favorite Bike

Rahul Gandhi: ‘ఎన్‍ఫీల్డ్ బైక్‍లు నచ్చవు, కార్లపై ఇంట్రెస్ట్ లేదు’: తన ఫేవరెట్ బైక్ ఏదో చెప్పిన రాహుల్ గాంధీ

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 28, 2022 12:47 PM IST

Rahul Gandhi’s favorite Bike: తనకు ఇష్టమైన బైక్ ఇదో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. కార్లతో పాటు మరిన్ని విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Rahul Gandhi: ‘ఎన్‍ఫీల్డ్ బైక్‍లు నచ్చవు, కార్లపై ఇంట్రెస్ట్ లేదు’: రాహుల్ గాంధీ
Rahul Gandhi: ‘ఎన్‍ఫీల్డ్ బైక్‍లు నచ్చవు, కార్లపై ఇంట్రెస్ట్ లేదు’: రాహుల్ గాంధీ

Rahul Gandhi’s favorite Bike: కార్లు, బైక్‍‍లతో పాటు మరికొన్ని విషయాలపై తన అభిప్రాయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాంబే జర్నీకి ఇచ్చిన ముఖాముఖిలో చాలా విషయాలను వెల్లడించారు. భారత్ జోడో యాత్రతో నాలుగు నెలలుగా ఫుల్ బిజీగా ఉన్న రాహుల్ గాంధీ.. అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ఇష్టాల గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత కాలంలో తాను సైకిల్ నడిపేందుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నానని చెప్పారు. అలాగే ఫేవరెట్ బైక్‍తో పాటు కార్ల విషయంపైనా మాట్లాడారు.

నాకు ఫేవరెట్ బైక్ అదే

Rahul Gandhi’s favorite Bike: తనకు ఎప్పుడూ ఎన్‍ఫీల్డ్ బైక్‍లంటే ఇష్టం లేదని రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్‍ఫీల్డ్ బైక్‍ల బ్యాలెన్స్, బ్రేక్‍లు తనకు నచ్చవని చెప్పారు. అయితే చాలా మంది వాటిని ఇష్టపడతారని అన్నారు. తనకు యమహా ఆర్‌డీ 350 బైక్ అంటే ఇష్టమని అన్నారు. అలాగే తన ఆల్‍టైమ్ ఫేవరెట్ బైక్ గురించి వెల్లడించారు. “నేను లండన్‍లో పని చేస్తున్నప్పుడు వినియోగించిన బైక్ నాకు ఫేవరెట్‍గా ఉంది. దాన్ని జీవితాంతం ప్రేమిస్తా. అదే అప్రిలియా ఆర్ఎస్250 (Aprilia RS250)” అని రాహుల్ గాంధీ చెప్పారు.

కారు రిపేర్ చేయగలను

“నాకు కార్లు అంటే ఆసక్తి లేదు. కానీ డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్. నాకు మోటార్‌బైక్ ఉంది. కార్లకు సంబంధించిన 90 శాతం టెక్నికల్ అంశాలు నాకు తెలుసు. చిన్నపాటి రిపేర్లు చేయగలను. కానీ కార్లపై మోజు లేదు. పాత లాంబ్రెటా నాకు బాగా అనిపిస్తుంది. అయితే దాన్ని నడిపేందుకు చాలా కష్టపడాలి. ప్రమాదకరం కూడా” అని రాహుల్ గాంధీ చెప్పారు.

ప్రస్తుతం ఢిల్లీలో డ్రైవింగ్ కాస్త ప్రమాదకరంగా మారిందని, అందుకే తాను సైకిల్ నడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. తన సొంత శక్తితో నడుస్తుంది కాబట్టి సైకిల్‍కే ప్రాధాన్యమిస్తున్నానని అన్నారు. “నా తండ్రి పైలట్. దీంతో విమానం నడపడం గురించి ఆయన నుంచి కాస్త నేర్చున్నాను. ముఖ్యంగా పైలట్ యాటిట్యూడ్ ఎలా ఉండాలని తెలుసుకున్నాను” అని రాహుల్ గాంధీ.. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

భారత్ జోడో యాత్రకు బ్రేక్

Bharat Jodo Yatra: ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించారు రాహుల్ గాంధీ. ఢిల్లీలో యాత్ర ప్రవేశించిన తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నారు. జనవరి 3వ తేదీన ఢిల్లీ నుంచి మళ్లీ నడక కొనసాగించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర మొదలైంది. ఇప్పటికి 2,800 కిలోమీటర్లకు పైగా సాగింది. 2023 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లో భారత్ జోడో యాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంది.

IPL_Entry_Point