One nation- One election : ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలతో రాష్ట్రాలపై దాడి’
One nation- One election : ఒకే దేశం- ఒకే ఎన్నికల పద్ధతిని తీసుకొస్తే దేశ ఐకమత్యం, రాష్ట్రాలపై దాడి చేసినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
One nation- One election : ఈ నెల 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర పిలుపునివ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' అంశంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇప్పుడు దేశంలో చర్చంతా ఈ వన్ నేషన్- వన్ ఎలక్షన్పైనే! తాజాగా ఈ వ్యవహారంపై మౌనం వీడారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ఒకే దేశం ఒకే ఎన్నికలకు వ్యతిరేకంగా ట్వట్ చేశారు.
"ఇండియా, అంటే భారత్, అంటే రాష్ట్రాల ఐకమత్యం. ఒకే దేశం- ఒకే ఎన్నికల ఆలోచనతో ఇండియన్ యూనియన్‌తో పాటు రాష్ట్రాలపై దాడి చేస్తున్నారు," అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
కమిటీ నుంచి తప్పుకున్న అధీర్ రంజన్ చౌదరి!
Rahul Gandhi on One nation- One election : పార్లమెంట్ స్పెషల్ సెషన్లో వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంశాన్ని మోదీ ప్రభుత్వం ప్రస్తావిస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ అంశం చుట్టూ ఇప్పటికే చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. విపక్షంలోని చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. కొందరు ట్రైల్ బేసిస్‌లో పరీక్షించాలని సూచిస్తున్నారు.
ఇక కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా, మాజీ ఎంపీ గులామ్ నబీ ఆజాద్, మాజీ ఆర్థికమంత్రి ఎన్కే సింఘ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జెనరల్ సుభాష్ సీ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కథారీలు ఉన్నాయి. కమిటీలో సభ్యుడిగా చేరాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొద్ది నెలల సమయంలో ఇలా చట్టలను మార్చేందుకు కమిటీలను వేయడం సరైన విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
One nation- One election committee : ఈ ఏడాది నవంబర్- డిసెంబర్ మధ్యలో మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్-జూన్ మధ్యలో లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. 1967లో లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1968, 1969లో కొన్ని అసెంబ్లీలు రద్దు అయ్యాయి. 1970లో లోక్‌సభ రద్దు అయ్యింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది.
సంబంధిత కథనం