One nation- One election : ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం!-committee under ex president ram nath kovind to explore possibility of one nation one election ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Nation- One Election : ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం!

One nation- One election : ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం!

Sharath Chitturi HT Telugu
Sep 01, 2023 09:57 AM IST

One nation- One election : ఒకే దేశం- ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. కేంద్రం ఓ కమిటీని వేసినట్టు తెలుస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అధ్యక్షతన ఈ కమిటీ నివేదికను రూపొందిస్తుందని సమాచారం.

ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం!
ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం! (HT_PRINT)

One nation- One election : కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్​ 18-22 మధ్య జరగనున్న ఈ స్పెషల్​ సెషన్​ అజెండాపై ప్రభుత్వం మౌనం వహిస్తుండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే.. ఈ సమావేశాల్లో 'వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​ (ఒకే దేశం- ఒకే ఎన్నికలు)' అంశంపై కీలక చర్చలు జరుగుతాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వీటికి బలాన్ని ఇచ్చే విధంగా తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఓ కమిటీని వేసినట్టు తెలుస్తోంది. భారత దేశ మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నేతృత్వంలో ఈ కమిటీ ఉండనుందని సమాచారం.

ఒకే దేశం- ఒకే ఎన్నికలు..

ప్రస్తుతం లోక్​సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. ఫలితంగా ఖర్చులు ప్రతియేటా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల పద్ధతిని తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయంపై అనేక సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడారు.

Parliament special session : ఈ ఏడాది నవంబర్​- డిసెంబర్​ మధ్యలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్​- మేలో లోక్​సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటి మధ్య తాజాగా.. వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​ అంశం తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నేతృత్వంలో పనిచేసే కమిటీ నివేదిక ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది.

మరి సెప్టెంబర్​ 18న మొదలయ్యే పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల్లో ఈ విషయంపై చర్చ ఉంటుందా? లేదా వేచి చూడాలి.

ముందస్తు ఉంటుందా..?

మరోవైపు.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం.. ముందస్తు ఎన్నికలకు వెళుతుందని కూడా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అందుకే పార్లమెంట్​ స్పెషల్​ సెషన్​ను నిర్వహించి, ప్రభుత్వం ఇంతకాలం చేసిన పనులను వివరించనుందని టాక్​ నడుస్తోంది. అయితే ఇవి ఊహాగానాలు మాత్రమే. ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. పార్లమెంట్​ సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని, కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం