Rahul Gandhi marriage : ‘తమిళనాడు అమ్మాయితో రాహుల్​ గాంధీకి పెళ్లి చేస్తాం’-rahul gandhi amused when tamil nadu women discuss his marriage ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Marriage : ‘తమిళనాడు అమ్మాయితో రాహుల్​ గాంధీకి పెళ్లి చేస్తాం’

Rahul Gandhi marriage : ‘తమిళనాడు అమ్మాయితో రాహుల్​ గాంధీకి పెళ్లి చేస్తాం’

Sharath Chitturi HT Telugu

Rahul Gandhi marriage with Tamil girl : భారత్​ జోడో యాత్రలో ఉన్న రాహుల్​ గాంధీని కొందరు మహిళలు కలిశారు. ఈ క్రమంలో ఆయన పెళ్లి గురించి మాట్లాడారు.

రాహుల్​ గాంధీ (PTI)

Rahul Gandhi marriage with Tamil girl : 'భారత్​ జోడో యాత్ర'లో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడును చుట్టిన ఈ యాత్రలో భాగంగా.. అనేకమందితో రాహుల్​ గాంధీ చర్చలు జరిపారు. చిన్నారుల నుంచి పెద్దలు, వృద్ధుల వరకు.. చాలా మందిని కలిసి మాట్లాడారు. ఈ క్రమంలోనే 'రాహుల్​ గాంధీ పెళ్లి'కి సంబంధించి ఓ సంఘటన జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు. తమిళనాడులో ఎంజీఎన్​ఆర్​ఈజీఏ మహిళా వర్కర్లతో కలిశారు రాహుల్​ గాంధీ. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి గురించి వారు మాట్లాడారు.

"మార్తాండంలో ఎంజీఎన్​ఆర్​ఈజీఏ మహిళా వర్కర్లని రాహుల్​ గాంధీ కలిశారు. వారిలో ఓ మహిళ 'మీకు తమిళనాడు ఇష్టం అని మాకు తెలుసు. మీకు తమిళ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాము,' అని మాట్లాడింది. ఆ మాట విని రాహుల్​ గాంధీ నవ్వుకున్నారు. ఫొటోలో స్పష్టంగా తెలిసిపోతోంది," అని జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు.

Bharat Jodo Yatra : ఇక కాంగ్రెస్​ జోడో యాత్ర.. 150 రోజుల పాటు సాగనుంది. మొత్తం మీద 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ భారత్​ జోడో యాత్రలో కవర్​ చేస్తారు. కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్​ వరకు 3,750కిలోమీటర్ల యాత్ర సాగనుంది. ఈ క్రమంలో 22 ప్రధాన నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు రాహుల్​ గాంధీ.

భారత్​ జోడో యాత్రలో 5వ రోజు..

కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో బస చేయనున్నారు.

Rahul Gandhi Bharat Jodo Yatra : తిరువనంతపురంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంటైనర్ల (బస కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలు) శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి అనుమతి కూడా మంజూరైందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే చివరి నిమిషంలో, కేరళ సీపీఎం విద్యార్థి విభాగం, విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం దీనికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చాయి.

దీంతో యాత్రను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నామని, కాబట్టి కంటైనర్లకు బదులుగా, రాహుల్ గాంధీతో సహా పార్టీ నాయకులు ఆదివారం రాత్రి పాఠశాలలో బస చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.