Priyanka Gandhi: బిగ్ బాస్ ఫేమ్ యువతికి ప్రియాంక గాంధీ పీఏ బెదిరింపులు
Priyanka Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడు (PA) తనను బెదిరించాడని బిగ్ బాస్ సీజన్ 15 సీజన్ ఫేమ్ అర్చన గౌతమ్ (Archana Gautam) ఆరోపించారు.
Priyanka Gandhi PA misbehaves with a bigg boss contestant: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) వ్యక్తిగత సహాయకుడు (PA) Sandeep Singh తనను బెదిరించాడని బిగ్ బాస్ సీజన్ 15 సీజన్ ఫేమ్ అర్చన గౌతమ్ (Archana Gautam) ఆరోపించారు. తన కూతురు, బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్ ను చంపేస్తానని ప్రియాంక గాంధీ పీఏ బెదిరించాడని, కులం పేరుతో దూషించాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Priyanka Gandhi PA misbehaves with bigg boss contestant: కలిసే అవకాశం కల్పించాలని అడిగినందుకు..
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వాద్రాతో ఒకసారి కలిసి, మాట్లాడే అవకాశం కల్పించాలని బిగ్ బాస్ ఫేమ్, కాంగ్రెస్ లీడర్ అర్చన గౌతమ్ (Archana Gautam) ప్రియాంక (Priyanka Gandhi) వ్యక్తిగత సహాయకుడు సందీప్ సింగ్ (Sandeep Singh) ను కోరారు. ఆ సమయంలో అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, కులం పేరుతో దూషించాడని, చంపేస్తానని బెదిరించాడని అర్చన గౌతమ్ (Archana Gautam) ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. చత్తీస్ గఢ్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ (congress plenary) సమావేశాలకు తాను కూడా హాజరయ్యానన్నారు.
police case on Priyanka Gandhi PA: పోలీసులకు ఫిర్యాదు
ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు వచ్చిన సమయంలో ఆమెతో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని ప్రియాంక గాంధీ వ్యక్తిగత సహాయకుడు (PA) సందీప్ సింగ్ (Sandeep Singh) ను తన కూతురు, బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్ (Archana Gautam) కోరారని, అయితే, ఆ సమయంలో సందీప్ సింగ్ తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, కులం పేరుతో దూషించాడని అర్చన గౌతమ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో, సందీప్ సింగ్ పై ఎస్సీ, ఎస్టీ లపై వేధింపుల నిరోధక చట్టంలోని 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.