LK Advani : ఎల్​కే అద్వానీకి భారత రత్న అందజేసిన ముర్ము..-president murmu confers bharat ratna to lk advani in pm modis presence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lk Advani : ఎల్​కే అద్వానీకి భారత రత్న అందజేసిన ముర్ము..

LK Advani : ఎల్​కే అద్వానీకి భారత రత్న అందజేసిన ముర్ము..

Sharath Chitturi HT Telugu
Mar 31, 2024 01:06 PM IST

Bharat Ratna to LK Advani : మాజీ ఉప ప్రధాని ఎల్​కే​అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న ప్రదానం చేశారు. ఈ ఈవెంట్​లో మోదీ కూడా పాల్గొన్నారు.

అద్వానీకి భారత రత్న ఇస్తున్న రాష్ట్రపతి ముర్ము..
అద్వానీకి భారత రత్న ఇస్తున్న రాష్ట్రపతి ముర్ము..

Bharat Ratna to LK Advani : మాజీ ఉపప్రధాని, బీజేపీ దిగ్గజ నేత ఎల్ కే అద్వానీకి భారత ప్రభుత్వం.. భారత రత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. దేశంలోని అత్యున్నత పౌర పురస్కరమైన భారత రత్నను.. అద్వానీకి ఇచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి ముర్ము ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు. ఈ ఈవెంట్​లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.

LK Advani Bharat Ratna : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారత రత్న కోసం ఐదుగురు పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. శనివారం దిల్లీలో నిర్వహించిన ఈవెంట్​లో భారత రత్న అవార్డులను ప్రదానం చేసింది. కానీ.. అనారోగ్య సమస్యల కారణంగా.. అద్వానీ.. ఆ ఈవెంట్​కు వెళ్లలేదు. అందుకే.. ఆయన ఇంటికి వెళ్లి మళ్లీ.. భారత రత్నను ఇచ్చారు ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.

'ఎల్​కే అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం దక్కినందుకు ఆయనతో మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలపు అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞులలో ఒకరైన ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయం. అట్టడుగు స్థాయి నుంచి ఉపప్రధానిగా దేశానికి సేవలందించే స్థాయికి ఎదిగిన జీవితం ఆయనది. మన హోం మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ ఆదర్శవంతమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి" అని.. అద్వానీకి భారత రత్నను ప్రకటిస్తూ.. గతంలో ట్వీట్​ చేశారు నరేంద్ర మోదీ.

అద్వానీ ప్రస్తానం..

Bharat Ratna LK Advani latest news : 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్​లోని కరాచీలో జన్మించిన అద్వానీ.. విశిష్టమైన రాజకీయ జీవితం గడిపారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘకాలం ఆ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్​పేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా, ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు.

తన మేధో చాతుర్యం, అచంచలమైన సూత్రాలు, బలమైన- సంపన్న భారతదేశం కోసం మద్దతుగా నిలిచి ఎందరి నుంచి ప్రశంసలు అందుకున్న అద్వానీని భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తిగా భావిస్తారు.

Bharat Ratna : జాతీయవాదంపై తన ప్రధాన విశ్వాసం విషయంలో అద్వానీ ఎన్నడూ రాజీపడలేదని అటల్ బిహారీ వాజ్ పేయి ఒకసారి చెప్పారు.

సంబంధిత కథనం