Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు-president murmu confers bharat ratna to former pms narasimha rao charan singh two others posthumously ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు

Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు

Mar 30, 2024, 07:15 PM IST HT Telugu Desk
Mar 30, 2024, 07:15 PM , IST

Bharat Ratna: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ లకు మరణానంతరం భారతరత్న ప్రకటించారు. అవార్డు గ్రహీతల తరఫున వారి కుటుంబ సభ్యలు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ప్రదానం చేశారు. ఈ అవార్డును ఆయన కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్ అందుకున్నారు. కర్పూరి ఠాకూర్ 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

(1 / 6)

రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ప్రదానం చేశారు. ఈ అవార్డును ఆయన కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్ అందుకున్నారు. కర్పూరి ఠాకూర్ 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.(PTI)

కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్ రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డును అందుకుంటున్న మరో చిత్రం.

(2 / 6)

కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్ నాథ్ ఠాకూర్ రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డును అందుకుంటున్న మరో చిత్రం.(PTI)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాష్ట్రపతి భవన్ లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ ఎంఎస్ స్వామనాథన్ కూతురు డాక్టర్ నిత్యా రావు ఈ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో 'హరిత విప్లవ పితామహుడు' ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త. జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. స్వామినాథన్ వివిధ వ్యవసాయ పరిశోధనా ప్రయోగశాలలలో పరిపాలనా పదవులను కూడా నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.

(3 / 6)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాష్ట్రపతి భవన్ లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ ఎంఎస్ స్వామనాథన్ కూతురు డాక్టర్ నిత్యా రావు ఈ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో 'హరిత విప్లవ పితామహుడు' ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త. జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. స్వామినాథన్ వివిధ వ్యవసాయ పరిశోధనా ప్రయోగశాలలలో పరిపాలనా పదవులను కూడా నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.(PTI)

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబరు 23, 2004) న్యాయవాది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత. 1991 నుంచి 1996 వరకు క్లిష్టసమయంలో ప్రధానిగా భారత దేశాన్ని పాలించారు. 1991 లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పీవీ నరసింహారావు ప్రభుత్వం  ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు పెద్ద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.

(4 / 6)

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబరు 23, 2004) న్యాయవాది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత. 1991 నుంచి 1996 వరకు క్లిష్టసమయంలో ప్రధానిగా భారత దేశాన్ని పాలించారు. 1991 లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పీవీ నరసింహారావు ప్రభుత్వం  ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు పెద్ద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.(PTI)

మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ కు భారత ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాన్ని ఆయన తరఫున, ఆయన కుమారుడు, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తో ప్రారంభించారు. అయితే 1967లో కాంగ్రెస్ ను వీడి సంయుక్త విధాయక్ దళ్ సంకీర్ణ నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. చౌదరి చరణ్ సింగ్ 1979 జూలై 28 న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కాని వెంటనే రాజీనామా చేశారు.

(5 / 6)

మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ కు భారత ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాన్ని ఆయన తరఫున, ఆయన కుమారుడు, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తో ప్రారంభించారు. అయితే 1967లో కాంగ్రెస్ ను వీడి సంయుక్త విధాయక్ దళ్ సంకీర్ణ నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. చౌదరి చరణ్ సింగ్ 1979 జూలై 28 న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, కాని వెంటనే రాజీనామా చేశారు.(PTI)

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారతరత్న కోసం ఐదుగురు పేర్లను ప్రకటించింది, వారిలో బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ కూడా ఉన్నారు.అనారోగ్య కారణాలతో అద్వానీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డ్ ల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. త్వరలో రాష్ట్రపతి ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తారని సమాచారం.

(6 / 6)

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారతరత్న కోసం ఐదుగురు పేర్లను ప్రకటించింది, వారిలో బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ కూడా ఉన్నారు.అనారోగ్య కారణాలతో అద్వానీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డ్ ల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. త్వరలో రాష్ట్రపతి ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తారని సమాచారం.(ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు