Agni-5 missile : మిషన్​ ‘దివ్యాస్త్ర’ సక్సెస్​- ఒకేసారి చైనా మొత్తాన్ని స్ట్రైక్​ చేయొచ్చు!-pm modis big announcement on mission divyastra indigenously developed agni 5 missile ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Agni-5 Missile : మిషన్​ ‘దివ్యాస్త్ర’ సక్సెస్​- ఒకేసారి చైనా మొత్తాన్ని స్ట్రైక్​ చేయొచ్చు!

Agni-5 missile : మిషన్​ ‘దివ్యాస్త్ర’ సక్సెస్​- ఒకేసారి చైనా మొత్తాన్ని స్ట్రైక్​ చేయొచ్చు!

Sharath Chitturi HT Telugu
Mar 11, 2024 06:12 PM IST

Mission Divyastra : అగ్నీ-5 మిసైల్​ టెస్ట్​ ఫ్లైట్​పై కీలక ప్రకటన చేశారు ప్రధాని మోదీ. డీఆర్​డీఓ చేపట్టిన మిషన్​ దివ్యాస్త్ర విజయం సాధించిందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ.. (PTI)

Mission Divyastra : మిషన్​ 'దివ్యాస్త్ర'పై కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్నీ-5 మిసైల్​ మొదటి ఫ్లైట్​ టెస్ట్​ విజయవంతమైందని ప్రకటించారు. ఈ క్షిపణిలో.. మల్టిపుల్​ ఇండిపెండెంట్లీ టార్గెటెబుల్​ రీ-ఎంట్రీ వెహికిల్​ (ఎంఐఆర్​వీ) టెక్నాలజీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు.. డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

"డీఆర్​డీఓ శాస్త్రవేత్తలను చూస్తే గర్వంగా ఉంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్నీ-5 మిసైల్​ తొలి టెస్ట్​ ఫ్లైట్, మిషన్​ దివ్యాస్త్ర సక్సెస్​ అయ్యింది,​ " అని మోదీ తెలిపారు.

ఈ మిషన్​ దివ్యాస్త్ర.. అతిపెద్ద అడ్వాన్స్​డ్​ వెపన్స్​ సిస్టమ్​ అని తెలుస్తోంది. దేశ భౌగోళిక స్థితిగతులను మార్చేసే సత్తా దీనికి ఉన్నట్టు సమాచారం. ఎంఐఆర్​వీ టెక్నాలజీతో.. ఒక్కటే మిసైల్​ని ఉపయోగించి మల్టిపుల్​ వార్​ హెడ్స్​ని, వివిధ ప్రాంతాల్లో మోహరించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Agni-5 missile PM Modi : ప్రపంచంలో.. ఈ ఎంఐఆర్​వీ టెక్నాలజీ కలిగిన ఉన్న దేశాలు చాలా తక్కువ! ఇక మిషన్​ దివ్యాస్త్ర సక్సెస్​ అవ్వడంతో.. వాటి సరసన చేరింది ఇండియా.

ఈ అగ్ని-5 మిసైల్​ సిస్టెమ్​లో ఇండీజీనియస్​ ఏవియోనిక్స్​ సిస్టెమ్స్​ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్​ ప్యాకేజ్​లు కూడా ఉంటాయి. ఫలితంగా.. రీ-ఎంట్రీ వెహికిల్స్​.. అత్యంత అక్యురసీతో టార్గెట్స్​ని హిట్​ చేస్తాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశ టెక్నాలజీ శక్తికి.. ఈ మిషన్​ దివ్యాస్త్ర ఉదాహరణగా నిలువనుంది.

అగ్నీ-5 రేంజ్​ 5000 కి.మీలు. భారత దేశ సుదీర్ఘ భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. చైనా ఉత్తర భాగంతో సహా మొత్తం ఆసియా, యూరోప్​లోని కొన్ని ప్రాంతాలు.. ఈ మిసైల్​ స్ట్రైకింగ్​ రేంజ్​ అని తెలుస్తోంది!

Agni-5 missile range : అగ్నీ1-4 క్షిపణుల రేంజ్​ 700కి.మీలు- 3,500 కి.మీల మధ్యలో ఉంటుంది. వీటిని భారత దేశ భద్రత కోసం ఇప్పటికే మోహరించారు.

దేశ భద్రతకు ఇటీవలి కాలంలో ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా.. బాలిస్టిక్​ మిసైళ్లను అడ్డుకునేందుకు ప్రత్యేక సిస్టెమ్​లను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసి, టెస్ట్​ చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

సంబంధిత కథనం