Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైలును ప్రారంభిస్తారు. వారంలో గురువారం మినహా ఆరు రోజులు ఈ రైలు పరుగులు తీయనుంది.
Vande Bharat Express: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో మరొకటి ప్రయాణికులకు మార్చి 12 మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగో Vande Bharat రైలు పట్టాలనెక్కనుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నంవి మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది.తెలంగాణలో మొదలయ్యే వందే భారత్ శ్రేణిలో ఇది నాలుగవది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఈ రైలు పరుగులు తీయనుంది.
ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో Vande Bharat రైలును ప్రవేశపెట్టారు. మార్చి 13 బుధవారం నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు తొలి సర్వీస్ నడుస్తుంది.
మార్చి 15వ తేదీ శుక్రవారం నుంచి సికింద్రాబాద్-విశాఖ సర్వీసులు మొదలవుతాయి. దీనికి మార్చి 12నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
ట్రైన్ నంబర్ 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05కు బయల్దేరుతుంది. విశాఖపట్నం మధ్యాహ్నం 1.50కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 20708 విశాఖపట్నం - సికింద్రాబాద్ సర్వీస్ మధ్యాహ్నం 2.35కు విశాఖలో బయల్దేరుతుంది. రాత్రి 11.20కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
వందే భారత్ రైలును వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆపుతారు. ఏడు ఏసీ ఛైర్ కోచ్‌లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఉంటుంది. ఈ రైలులో 530మంది ప్రయాణించవచ్చు.
సికింద్రాబాద్‌లో Secunderabad ఉదయం 5.05కు బయల్దేరే రైలు వరంగల్ 6.40, ఖమ్మం 7.45, విజయవాడ 9.10, రాజమండ్రి 11.02, సామర్లకోట 11.45, విశాఖపట్నం 1.50కు బయలుదేరుతుంది. ఒక్కో స్టేషన్‌లో నిమిషం మాత్రమే ఆగుతుంది. విజయవాడలో మాత్రమే ఐదు నిమిషాల హాల్ట్ ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో Return Journey విశాఖలో 2.35కు, సామర్లకోటలో సాయత్రం 4.5కు, రాజమండ్రిలో 4.40, విజయవాడలో 6.45, ఖమ్మంలో 8.05, వరంగల్‌లో 9.05, సికింద్రాబాద్‌కు 11.20కు చేరుతుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య ప్రకటించింది.
ప్రయాణ సమయం Travel Time తక్కువగా ఉండటంతో ఈ రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ బాగుంది. విజయవాడకు నాలుగు గంటలలో చేరుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది.
చాలా సార్లు వందేభారత్‌లో రిజర్వేషన్ Reservation కూడా దొరకడం లేదు. రెండు వైపులా ప్రయాణానికి ఒక్క రైలు ఉండటంతో సాంకేతికంగానూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నడుస్తున్న తొలి రైలు 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్త రైలు ఎనిమిది బోగీలతో పరుగులు తీయనుంది.