PM Modi: ‘‘ఈస్ట్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్ లలో కూడా ‘ఇండియా’ ఉంది..’’: విపక్ష కూటమిపై ప్రధాని ధ్వజం-pm modi takes a jibe at india bloc says ateempt to mislead people as ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: ‘‘ఈస్ట్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్ లలో కూడా ‘ఇండియా’ ఉంది..’’: విపక్ష కూటమిపై ప్రధాని ధ్వజం

PM Modi: ‘‘ఈస్ట్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్ లలో కూడా ‘ఇండియా’ ఉంది..’’: విపక్ష కూటమిపై ప్రధాని ధ్వజం

HT Telugu Desk HT Telugu
Jul 25, 2023 02:06 PM IST

PM Modi takes a jibe at INDIA bloc: కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కూటమి పేరులో ఇండియా అని పెట్టుకుని ప్రజలను మోసం చేయలేరని విపక్ష నేతలపై మండిపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PTI)

PM Modi takes a jibe at INDIA bloc: కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమికి ‘ఇండియా (INDIA)’ అని పేరు పెట్టుకోవడంపై ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కూటమి పేరులో ఇండియా అని పెట్టుకుని ప్రజలను మోసం చేయలేరని విపక్ష నేతలపై మండిపడ్డారు. కూటమి పేరులో ఇండియా అని ఉన్నంత మాత్రాన ప్రజలు మోసపోరని, ప్రతిపక్షం అసలు రూపం ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.

ఈస్ట్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్

భారత్ ను నాశనం చేసిన కంపెనీలు, దేశంలో విధ్వంసం సృష్టించడం కోసం రూపొందిన ఉగ్రవాద సంస్థల పేర్లలో కూడా ఇండియా అని ఉంటుందని ఎద్దేవా చేశారు. భారత్ ను వలస పాలనలోకి తీసుకువెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ, ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిదీన్, పీఎఫ్ఐ పేర్లలో కూడా ‘ఇండియా’ ఉంటుందని గుర్తు చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతో ఏఓ హ్యూమ్ అనే బ్రిటిష్ వ్యక్తే స్థాపించాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ మంగళవారం ప్రసంగించారు. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావడంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ నాయకులు చర్చించారు.

దశ, దిశ లేని విపక్షం

దేశంలో ప్రతిపక్షం దశ, దిశ లేకుండా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. సైద్ధాంతిక వైరుద్ధ్యాలన్న నాయకులు, రాష్ట్రాల్లో పరస్పరం ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు కలిసి ఇండియా అనే పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షం నిస్పృహలో ఉందన్నారు. 2024 లో ఎన్డీయే దే మళ్లీ విజయమని, వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షం శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటుందన్నారు. అందుకు ప్రతిపక్షం కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. బీజేపీ నాయకత్వంలో దేశంలో నవోదయం సాధ్యమైందని, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడించిందని ప్రధాని మోదీ తెలిపారు.

Whats_app_banner