Viral Video: కస్టమర్ రూ.2,000 నోటు ఇచ్చాడని స్కూటర్‌లో పోసిన పెట్రోల్ వెనక్కి తీసుకున్నాడు!: వీడియో-petrol pump worker drains out petrol from scooter after getting 2000 rupees note from customer video goes viral
Telugu News  /  National International  /  Petrol Pump Worker Drains Out Petrol From Scooter After Getting 2000 Rupees Note From Customer Video Goes Viral
Viral Video: కస్టమర్ రూ.2,000 నోటు ఇచ్చాడని స్కూటర్‌లో పోసిన పెట్రోల్ వెనక్కి తీసుకున్నాడు! (Photo: Twitter)
Viral Video: కస్టమర్ రూ.2,000 నోటు ఇచ్చాడని స్కూటర్‌లో పోసిన పెట్రోల్ వెనక్కి తీసుకున్నాడు! (Photo: Twitter)

Viral Video: కస్టమర్ రూ.2,000 నోటు ఇచ్చాడని స్కూటర్‌లో పోసిన పెట్రోల్ వెనక్కి తీసుకున్నాడు!: వీడియో

24 May 2023, 8:29 ISTChatakonda Krishna Prakash
24 May 2023, 8:29 IST

₹2000 Note - Viral Video: కస్టమర్ రూ.2,000 నోటు ఇచ్చాడనే కారణంతో స్కూటర్‌లో నింపిన పెట్రోల్‍ను వెనక్కి తీసుకున్నాడు ఓ పెట్రోల్ బంక్ వర్కర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

2000 Note - Viral Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.2,000 నోటుపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. రూ.2,000 నోటుకు ఉప సంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. రూ.2,000 నోట్లను ప్రజలు బ్యాంకుల్లో మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని చెప్పింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అయితే, ఉపసంహరణ ప్రకటన చేసినా.. రూ.2,000 నోటు ప్రస్తుతం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లతో కొనుగోళ్లు చేసుకోవచ్చని, స్వీకరించవచ్చని చెప్పింది. అయితే, కొందరు రూ.2,000 నోటును అంగీకరించటం లేదు. ఆర్బీఐ ప్రకటన తర్వాత రూ.2,000 నోట్లు ఎక్కువగా వస్తుండటంతో తీసుకునేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‍లో జరిగింది. కస్టమర్ రూ.2,000 నోటు ఇచ్చాడని.. ఓ పెట్రోల్ బంక్ వర్కర్ ఏకంగా స్కూటర్‌లో పోసిన పెట్రోల్‍ను వెనక్కి తీసుకున్నాడు. వివరాలివే.

2000 Note - Viral Video: ఉత్తర ప్రదేశ్‍(Uttar Pradesh) లోని జల్‍గావ్ (Jalgaon) జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్కూటర్‌లో పెట్రోల్ పోయించుకొని ఓ కస్టమర్ పెట్రోల్ బంకు వర్కర్‌కు రూ.2,000 నోటు ఇచ్చాడు. అయితే, ఆ నోటును తీసుకునేందుకు ఆ వర్కర్ నిరాకరించాడు. చిన్న నోటు ఇవ్వాలని కోరాడు.

2000 Note - Viral Video: ఈ విషయంపై ఆ కస్టమర్‌కు, ఆ ఉద్యోగికి వాదన జరిగింది. చివరికి, స్కూటర్‌లో నింపిన పెట్రోల్‍ను ఆ వర్కర్ వెనక్కి తీసుకున్నాడు. కస్టమర్ వేరే నోటు.. ఇవ్వకపోవటంతో స్కూటర్ ట్యాంక్‍లో పైప్ వేసి.. నింపిన పెట్రోల్‍ను దాని ద్వారా వెనక్కి తీసుకున్నాడు. స్కూటర్ నుంచి పెట్రోల్ బయటికి తీసిన వీడియోను ట్విట్టర్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశారు. చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటనపై ఆ పెట్రోల్ పంప్ మేనేజర్ రాజీవ్ గిర్హోత్రా స్పందించారు. ఆర్బీఐ ప్రకటన తర్వాత రూ.2,000 నోట్లు తమ వద్దకు చాలా వస్తున్నాయని అన్నారు. పెట్రోల్ బంకులకు ఇది తలనొప్పిగా మారిందని చెప్పారు. రూ.50 పెట్రోల్ ఫిల్ చేయించుకొని కొందరు ఏకంగా రూ.2,000 నోటు ఇస్తున్నారని అన్నారు. ఒకప్పుడు రోజుకు మూడు లేదా నాలుగు రూ.2,000 నోట్లు వచ్చేవని, ఆర్బీఐ ప్రకటన తర్వాత రోజుకు 70 నోట్ల వస్తున్నాయని అన్నారు. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోయించుకుంటే రూ.2,000 నోట్లను తీసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు.

చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ గత వారం ప్రకటించింది. రూ.2,000 నోట్లను ప్రజలు సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకుల్లో మార్చుకోవడమో.. డిపాజిట్ చేయడమో చేయాలని చెప్పింది. అయితే, ప్రస్తుతం రూ.2,000 నోటు చెల్లుబాటు (Legal Tender) అవుతుందని పేర్కొంది.