Indian Startups | ఆరేళ్ల క్రితం 471.. ఇప్పుడు 72,993-number of startups in india grows to 72 993 in 2022 from 471 in 2016 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Startups | ఆరేళ్ల క్రితం 471.. ఇప్పుడు 72,993

Indian Startups | ఆరేళ్ల క్రితం 471.. ఇప్పుడు 72,993

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 11:06 PM IST

Indian Startups | ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల సంఖ్య భార‌త్‌లో భారీగా పెరుగుతోంది. టెక్నాల‌జీ ఆధారిత సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డంలో భార‌తీయులు ముందుంటున్నారు.

<p>ప్ర‌తీకాత్మ‌క చిత్రం</p>
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Indian Startups | వినూత్న ఆలోచ‌న‌ల‌తో, వినియోగ‌దారుల అభిరుచుల‌కు అనుగుణంగా, మార్కెట్ ట్రెండ్‌ను అనుస‌రిస్తూ కొత్త కొత్త స్టార్ట్ అప్‌ల‌ను భార‌తీయ యువ‌త ఏర్పాటు చేస్తున్నారు.

Indian Startups | 15 వేల శాతం పెరుగుద‌ల‌

భార‌తీయ స్టార్ట్ అప్ ల సంఖ్య గ‌త ఆరేళ్ల‌లో ఊహించ‌ని స్థాయిలో పెరిగింది. 2016లో గుర్తింపు పొందిన భార‌తీయ స్టార్ట్ అప్‌ల సంఖ్య కేవ‌లం 471 కాగా, గ‌త ఆరేళ్ల‌లో ఆ సంఖ్య భారీగా పెరిగింది. జూన్ 30, 2022 నాటికి గుర్తింపుపొందిన భార‌తీయ స్టార్ట్ అప్ లు 72, 993 ఉన్నాయి. అంటే దాదాపు 15,400% పెరుగుద‌ల అన్న‌మాట‌. ఈ వివ‌రాల‌ను కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి సోమ్ ప్ర‌కాశ్ వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న సానుకూల విధానాల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో ఆయ‌న వివ‌రించారు.

Indian Startups | అభివృద్దిలొ కీల‌కం

ప్ర‌స్తుతం ఏ దేశ అభివృద్ధిలో అయినా టెక్నాల‌జీ ఇకో సిస్ట‌మ్ దే కీల‌క పాత్ర. ఈ విష‌యాన్ని ముందే గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం 2016 జ‌న‌వ‌రిలో స్టార్ట్ అప్ ఇండియా(Startup India) కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. భార‌త్ లో స్టార్ట్ అప్ క‌ల్చ‌ర్‌ను పెంపొందించ‌డం, స్టార్ట్ అప్‌ల‌ను ప్రారంభించాల‌నుకునే వారికి అవ‌స‌ర‌మైన సాయం అందించ‌డం లక్ష్యంగా ఈ కార్య‌క్ర‌మం రూపొందించారు. త‌ద్వారా Startups భార‌త ఆర్థిక అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషించాల‌ని భావించారు.

Indian Startups | 56 సెక్టార్ల‌లో..

56 వేర్వేరు కీల‌క రంగాల్లో startups ఏర్పాట‌య్యాయ‌ని Department for Promotion of Industry and Internal Trade (DPIIT) గుర్తించింది. అత్యంత నూత‌న టెక్నాల‌జీ రంగాలైన Internet of Things (IoT), robotics, artificial intelligence, analytics ల్లో దాదాపు 4500 startups ఏర్పాట‌య్యాయి. startups ఏర్పాటు చేయాల‌నుకునే వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వ శాస్త్ర‌, సాంకేతిక విభాగం(Department of Science and Technology - DST) నిధి(National Initiative for Developing and Harnessing Innovations ) అనే కార్య‌క్ర‌మాన్ని 2016లోనే ప్రారంభించింది. ఈ నిధి కార్య‌క్ర‌మం ద్వారా వినూత్న ఐడియాల‌ను స్టార్ట్ అప్ లుగా మార్చ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హ‌కారం అందిస్తారు.

Whats_app_banner