Chandrayaan-3 technician: 18 నెలలుగా జీతం లేదు; ఇడ్లీలు అమ్ముతున్న చంద్రయాన్ 3 టెక్నీషియన్..-no salary for 18 months technician who helped in chandrayaan 3 is selling idlis ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  No Salary For 18 Months, Technician Who Helped In Chandrayaan-3 Is Selling Idlis

Chandrayaan-3 technician: 18 నెలలుగా జీతం లేదు; ఇడ్లీలు అమ్ముతున్న చంద్రయాన్ 3 టెక్నీషియన్..

రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్న హెచ్ఈఎల్ ఉద్యోగి దీపక్ కుమార్
రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్న హెచ్ఈఎల్ ఉద్యోగి దీపక్ కుమార్

Chandrayaan-3 technician: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా చంద్రయాన్ 3 ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలంపై దింపింది.. కానీ.. ఆ ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఉద్యోగులకు మాత్రం గత 18 నెలలుగా వేతనాలు లేవు.

Chandrayaan-3 technician: చంద్రయాన్ 3 ఘన విజయంతో ఇస్రో ఉప్పొంగిపోయింది. భారతదేశానికి ప్రపంచం శుభాకాంక్షలు తెలిపింది. కానీ, చంద్రయాన్ 3 ప్రయోగంలో పాలు పంచుకున్న కొందరు సాంకేతిక నిపుణులు మాత్రం సంతోషంగా లేరు. వారికి గత 18 నెలలుగా జీతాలు లేవు. వారిలో ఒకరు బతుకు తెరువు కోసం రోడ్డు పక్కన చిన్న బండిపై ఇడ్లీలు అమ్ముతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాంచీలో..

రాంచీలో హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HEC - Heavy Engineering Corporation Limited) అనే ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో సుమారు 2800 మంది ఉద్యోగులున్నారు. అందులో ఒకరు దీపక్ కుమార్ ఉప్రారియా. ఆ సంస్థ చంద్రయాన్ 3 లాంచింగ్ ప్యాడ్, ఫోల్డింగ్ ప్లాట్ ఫామ్ ను రూపొందించింది. స్లైడింగ్ డోర్ రూపకల్పనలో పాలు పంచుకుంది. ఆ ఉద్యోగులెవరికీ గత 18 నెలలుగా వేతనాలు లేవు. వారి కుటుంబాలు పస్తులతో జీవనం గడుపుతున్నారు. వేతనాలు చెల్లించాలంటూ వారు ధర్నాలు కూడా చేశారు. కానీ, ఫలితం లేదు. దాంతో, దీపక్ కుమార్ వంటి ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లారు.

ఇడ్లీ బండి..

కొన్ని నెలల తరువాత అయినా జీతాలు రాకపోతాయా అన్న ఆశతో దీపక్ కుమార్ కూడా చాలా రోజులు ఉన్నాడు. కొన్ని రోజులు అప్పులు చేసి ఇంటి ఖర్చులు వెళ్లదీశాడు. మరికొన్ని రోజులు భార్య నగదు కుదువ పెట్టి గడిపాడు. ఇక అటు అప్పు పుట్టే మార్గం లేక, ఇటు జీతాలు రాక రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకున్నాడు. ఉదయం, సాయంత్రం ఇడ్లీలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటికైనా వేతనాలు వస్తాయన్న ఆశతో ఉద్యోగం మాత్రం కొనసాగిస్తున్నాడు. తన భార్య ఇడ్లీలు బాగా చేస్తుందని, ఈ చిన్న వ్యాపారంతో రోజులుకు రూ. 100 వరకు లాభం వస్తుంది’ అని ఆయన వివరిస్తున్నాడు.