చంద్రుడి దక్షిణ ధృవం వద్ద తన పనిని నిర్వహిస్తున్న విక్రమ్ ల్యాండర్ మరోసారి సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. శాస్త్రవేత్తలు ల్యాండర్ లోని ఇంజిన్లను మండించి.. 40 సెంటీమీటర్లు గాల్లోకి లేపారు. అది గాల్లోకి ఎగిరాక ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్లు పక్కకు జరిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. గాల్లోకి లేచిన విక్రమ్ ల్యాండర్, మళ్లీ సురక్షితంగా చంద్రుడిపైకి దిగిందని ఇస్రో తెలిపింది. ల్యాండర్ లోని పరికరాలన్నీ సరిగ్గానే పని చేస్తున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో మనుషులు, మిషన్లను వెనక్కి రప్పించే ప్రక్రియలో భాగంగా ఈ ప్రయోగం చేసినట్లు స్పష్టం చేశారు.