ఇండియాలో ఇక్కడ ఇకపై నాన్ వెజ్ ఉండదు.. మాంసాహారాన్ని నిషేధించిన తొలి నగరం ఇదే-no non veg in palitana city gujarat this is the first city to ban meat in the world ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇండియాలో ఇక్కడ ఇకపై నాన్ వెజ్ ఉండదు.. మాంసాహారాన్ని నిషేధించిన తొలి నగరం ఇదే

ఇండియాలో ఇక్కడ ఇకపై నాన్ వెజ్ ఉండదు.. మాంసాహారాన్ని నిషేధించిన తొలి నగరం ఇదే

Anand Sai HT Telugu
Jul 14, 2024 06:30 PM IST

Palitana Bans Non Veg : గుజరాత్ లోని ఓ నగరంలో మాంసాహారాన్ని నిషేధించారు. ప్రపంచంలో ఇలా చేసిన ఆ నగరం పేరు పాలిటానా.

పాలిటానాలో మాంసాహారం నిషేధం
పాలిటానాలో మాంసాహారం నిషేధం (freepik)

ఏకంగా ఒక నగరంలో మాంసాహారాన్ని నిషేధించడం అంటే చిన్న విషయం కాదు. ప్రపంచంలోనే మెుదటిసారిగా నాన్ వెజ్ నిషేధించిన నగరంగా పాలిటానా వార్తల్లోకి ఎక్కింది. ఈ పట్టణం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ నాన్ వెజ్ నిషేధించడానికి చాలా కారణాలు ఉన్నాయి.

పాలిటానా కేవలం ఒక నగరం కాదు.. ఇది జైనుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. గతంలో పాలిటానాలో 250 మాంసం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలను మూసివేయాలని 200 మంది జైన సన్యాసులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఇక్కడ మాంసంపై పూర్తి నిషేధం ఉంది.

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా నగరం మాంసాహారం అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొదటి నగరంగా వార్తల్లో నిలిచింది. జైనమతానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో సుమారు 200 మంది జైన సన్యాసులు నాన్ వెజ్ నిషేధించాలని నిరసన తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ నగరంలో మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది.

మాంసం కోసం జంతువులను విక్రయించడం, తినడం, వధించడం ఇప్పుడు ఇక్కడ చట్టవిరుద్ధం, చట్టం ప్రకారం శిక్షార్హమైనది. గతంలో పాలిటానాలో 250 మాంసం దుకాణాలు ఉండేవి. కానీ వాటిపై ఇప్పుడు నిషేధం ఉంది. దాదాపు 200 మంది జైన సన్యాసులు ఈ దుకాణాలను మూసివేయాలని నిరసన తెలిపారు.

ఇది జైనుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. దీనికి జైన్ టెంపుల్ టౌన్ అనే పేరు కూడా ఉంది. ఈ నగరంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఆదినాథ్ ఆలయం. పర్యాటకానికి మాత్రమే కాకుండా మతపరమైన ప్రాముఖ్యత కారణంగా కూడా పాలిటానా చారిత్రక నగరాలలో ఒకటి. ఈ ప్రాంతంలోని ఇతర దేవాలయాలతోపాటు జైనులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది.

పాలిటానా అనుసరించి, గుజరాత్‌లోని రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్‌లతో సహా ఇతర నగరాలు కూడా ఇదే విధమైన నిబంధనలు కావాలి అంటున్నాయి. రాజ్‌కోట్‌లో మాంసాహారం బహిరంగ ప్రదర్శనను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సున్నితత్వాన్ని గౌరవించడం, బహిరంగ ప్రదేశాల్లో మాంసాన్ని చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ చర్యలు ప్రవేశపెట్టినట్టుగా అధికారులు చెబుతున్నారు.

మాంసాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ప్రజల సున్నితత్వాన్ని కించపరచగలదని, సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిషేధించాలని పలువురు వాదించారు. అన్ని జీవుల పట్ల అహింస, కరుణను పెంపొందించే విధంగా ఉండాలని చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఈ నిబంధనలను సమర్ధించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాంసం దుకాణాల క్లస్టరింగ్ వల్ల ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కూడా తమ లక్ష్యమని పేర్కొన్నారు. పాలిటానాతో ఇతర గుజరాత్ నగరాల్లో మాంసాహార ఆహారాన్ని నిషేధించాలనే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇతర ప్రాంతాలు దీనిని ఎన్ని రోజులు అనుసరిస్తాయో లేదో చూడాలి.

Whats_app_banner