INS Kalvari : ఐఎన్‌ఎస్ కల్వరికి కొత్త టెక్నాలజీ.. నీటి అడుగునే రెండు వారాలు!-new technology aip system add to ins kalvari submarines to enhance ability to stay underwater for 2 weeks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ins Kalvari : ఐఎన్‌ఎస్ కల్వరికి కొత్త టెక్నాలజీ.. నీటి అడుగునే రెండు వారాలు!

INS Kalvari : ఐఎన్‌ఎస్ కల్వరికి కొత్త టెక్నాలజీ.. నీటి అడుగునే రెండు వారాలు!

Anand Sai HT Telugu
Jul 09, 2024 01:57 PM IST

INS Kalvari : ఐఎన్ఎస్ కల్వరి సబ్‌మెరైన్‌కు కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు. DRDO స్వదేశీంగా అభివృద్ధి చేసిన AIP వ్యవస్థ జలాంతర్గామి INS కల్వరిలో అమర్చుతున్నారు. దీంతో సబ్‌మెరైన్ రెండు వారాల పాటు నీటి అడుగున ఉండేందుకు వీలు కల్పిస్తుంది.

ఐఎన్ఎస్ కల్వరి
ఐఎన్ఎస్ కల్వరి

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌కు చెందిన జలాంతర్గాములు స్వయం సమృద్ధి సాధించేందుకు సిద్ధమయ్యాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) వ్యవస్థను అభివృద్ధి చేసింది. సాంప్రదాయ జలాంతర్గాములు గరిష్టంగా 14 గంటలు మాత్రమే నీటి అడుగున ఉండగలవు. ప్రస్తుతం అభివృద్ధి చేయబడుతున్న AIP వ్యవస్థ జలాంతర్గామి నీటిలో ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. వచ్చే ఏడాది నుంచి జలాంతర్గామిలో కొత్త ఏఐపీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రాజెక్టులో పాల్గొన్న సీనియర్ డీఆర్‌డీవో శాస్త్రవేత్త తెలిపారు.

మేడిన్ ఇండియా తొలి స్కార్పియస్ ఐఎన్ఎస్ కల్వరి మరింత టెక్నాలజీ అప్‌డెట్ చేసుకుని వస్తుంది. నీటిలో ఎక్కువ రోజులు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ కొత్త AIP వ్యవస్థ జలాంతర్గాములు దాదాపు రెండు వారాల పాటు నీటి అడుగున ఉండేలా చేస్తుంది. ప్రస్తుత కొద్ది రోజుల నుండి అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ అభివృద్ధి నౌకాదళ కార్యకలాపాలలో వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. Lఅండ్T వంటి ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో అభివృద్ధి చేసిన AIP వ్యవస్థపై చాలా రకాలుగా ట్రయల్స్‌ చేశారు. DRDO దాని అధిక భద్రత మార్జిన్లు, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇతర వ్యవస్థలతో పోలిస్తే మెరుగైన పనితీరు కారణంగా AIPని ఎంచుకుంది.

DRDO చీఫ్ సమీర్ కామత్ ఇటీవల Lఅండ్D AM నాయక్ హెవీ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో AIP ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ అధునాతన వ్యవస్థను వచ్చే ఏడాది జలాంతర్గామిలో ఏర్పాటు చేయడానికి ముందు మజాగాన్ డాక్‌యార్డ్ లిమిటెడ్ (MDL)లో తయారు చేసి పరీక్షిస్తామని ఆయన చెప్పారు.

AIP టెక్నాలజీ నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL) ప్రోగ్రామ్ డైరెక్టర్ సుమన్ రాయ్ చౌదరి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి జలాంతర్గామి INS కల్వరికి AIP అమర్చబడుతుందని ధృవీకరించారు.

AIP వ్యవస్థ జలాంతర్గాములను దాదాపు రెండు వారాల పాటు నీటి అడుగున ఉండేలా చేస్తుంది. INS కల్వరి అనేది MDL చేసిన స్కార్పెన్ తరగతికి చెందిన మొదటి జలాంతర్గామి. AIPని చేర్చే ప్రక్రియలో జలాంతర్గామిని రెండు భాగాలుగా కట్ చేసి కొత్త AIP విభాగాన్ని చొప్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జలాంతర్గామి పొడవు, బరువు రెండింటినీ పెంచుతుంది.

INS కల్వరిలో AIP వ్యవస్థ అప్‌డెట్ చేయడం విజయవంతమైతే ఈ వ్యవస్థను మరో ఐదు కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌లలో అమర్చవచ్చు.

Whats_app_banner