Maharashtra CM : సోమవారమే బలపరీక్ష.. కొత్త సీఎం సిద్ధమేనా?
Maharashtra CM : మహారాష్ట్రలో బలపరీక్షకు ఏక్నాథ్ షిండే సిద్ధమవుతున్నారు. సోమవారం బలపరీక్ష జరగనుంది.
Maharashtra CM : మహారాష్ట్ర రాజకీయ ఉత్కంఠ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర సీఎంగా శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే ప్రమాణ చేసేశారు. కాగా.. సోమవారం ఆయన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బలపరీక్షలో ఆయన గెలవడం సులభమే!
ఏక్నాథ్ షిండే బలపరీక్ష కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వాస్తవానికి ఇది శని, ఆదివారాల్లో జరగాల్సి ఉంది. వాటిని ఒక రోజు మార్చారు. ఇక శనివారం కొత్త స్పీకర్ నామిషన్ ప్రక్రియ ఉంటుంది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. శివసేనకు 55, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 సీట్లు దక్కాయి. ఫలితంగా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పుడు ఆ 55మందిలో 39మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ఏక్నాథ్ షిండే చెబుతున్నారు. సోమవారం జరిగే బలపరీక్షలే ఇదే నిరూపితమైతే.. ఏక్నాత్ షిండే గెలవడమే కాదు.. ఉద్ధవ్ ఠాక్రే ఓటమి కూడా లాంఛనంగా ఖారారైనట్టే! సీఎంగా రాజీనామా చేసిన సమయంలో.. శాసన మండలి సభ్యుడిగా కూడా తప్పుకున్నారు ఉద్దవ్ ఠాక్రే. శివసేన అధ్యక్షుడిగా కొనసాగుతానని చెప్పారు. కానీ ఇప్పుడు బలపరీక్షలో విజయం సాధిస్తే.. 'శివసైనికులు' ఏక్నాథ్ పక్షాన ఉన్నట్టు రుజువవుతుంది. ఉద్ధవ్ ఠాక్రే.. తన పార్టీని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే..
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే బృందం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉంటూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలను శాసనసభ కార్యకలాపాలకు అనుమతించకూడదని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. వాళ్లకి అసెంబ్లీలో కొనసాగే నైతిక అర్హత లేదని ఆరోపించింది.
ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు జులై 11న విచారించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం