Nepal plane crash | నేపాల్ విమానం అదృశ్యమైన ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. దాదాపు 5గంటల పాటు మిస్స్ అయిన తారా ఎయిర్‌లైన్స్ విమానాన్ని అధికారులు.. కోవాంగ్ గ్రామంలోని లంచే నదికి సమీపంలో గుర్తించారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా.. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. సోమవారం వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేని స్థితి! విమానంలోని 22మంది ప్రయాణికులు కుటుంబసభ్యులు ఆర్తనాథాలతో నేపాల్ విమానాశ్రయాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
అయితే.. నేపాల్‌కి విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా.. ఇక్కడ ఘోర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమాన ప్రమాదాల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ పరిస్థితులను మెరుగుపరచకపోవడం ఆందోళనకరం. ఇందుకు తాజా విమాన ఘటన ఉదాహరణ!
నేపాల్ విమానాశ్రయాల్లో భద్రతా ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా.. అత్యంత క్లిష్టమైన రన్వేలు అక్కడ ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి మంచుతో కూరుకుపోయి ఉంటాయి. అదే సమయంలో నేపాల్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. కొద్ది నిమిషాల్లో వాతావరణ మారిపోయి, పైలట్లను భయపెడుతూ ఉంటుంది. ఆదివారం కూడా.. వాతావరణ సరిగ్గా లేదని తెలుస్తోంది.
Nepal plane news | తాజాగా.. ఘటన జరిగిన విమానంలో 22మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు జర్మనీవాసులు, 13మంది నేపాలీలు. కాగా.. నలుగురు భారతీయులు సైతం విమానంలో ఉన్నారు. వారిని అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితిక త్రిపాఠి, వైభవి త్రిపాఠిలుగా గుర్తించారు.
కుప్పకూలిన విమానాన్ని.. పైలట్ ఫోన్లో ఉన్న జీపీఎస్ లొకేషన్ నెట్వర్క్ ద్వారా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది.
ప్రమాదం జరిగిన సమయంలో.. విమనాన్ని కెప్టెన్ ప్రభాకర్ ఘిమిరె నడుపుతున్నారు.
"ప్రమాదం జరిగిన తర్వాత.. పైలట్ ఘిమిరె ఫోన్‌కు కాల్ చేశాము. అది మోగుతూనే ఉంది. ఫలితంగా లొకేషన్‌ను గుర్తించగలిగాము," అని ఓ అధికారి వెల్లడించారు.
సంబంధిత కథనం