Nepal earthquake : నేపాల్‌లో భూకంపం ధాటికి 128మంది మృతి!
Nepal earthquake : నేపాల్‌లో భూకంపం కారణంగా 128మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.
Nepal earthquake today : నేపాల్‌లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌కు వాయువ్యంవైపు ఉన్న జుమ్లా అనే ప్రాంతానికి 42కి.మీల దూరంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 6.4గా రికార్డు అయ్యింది. ఈ ఘటనలో 128మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
నేపాల్‌లో భూకంపం..
భూమికి కేవలం 18కి.మీల దిగువన ప్రకంపనలు నమోదయ్యాయి. ఫలితంగా తీవ్రత కాస్త ఎక్కువగానే కనిపించింది. నేపాల్ భూకంపం నేపథ్యంలో అనేక భవనాలు నేలకూలాయి. ఘటనాస్థలంలో స్థానికులు.. చీకటిలో శిథిలాల నుంచి ప్రజలను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Nepal earthquake now : నేపాల్‌లో భూకంపం సమయంలో నిద్రలో ఉన్న ప్రజలు.. ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
నేపాల్‌లోని జాజర్కోట్ జిల్లాలో కనీసం 26మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. "ఇంకా చీకటిగానే ఉంది. ప్రాణనష్టం ఎంత జరిగింది? ఆస్తి నష్టం ఎంత జరిగింది? అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది," అని అధికారులు చెప్పారు.
పరిసర రుకుమ్ వెస్ట్ ప్రాంతంలో.. 36మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85మంది వరకు గాయపడ్డారు.
Nepal earthquake death toll : నేపాల్‌లో తాజా భూకంపం నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ఘటనాస్థలానికి సహాయక సిబ్బంది పరుగులు తీశారు. చీకటిలోనే.. శిథిలాల కింద నుంచి ప్రజలను బయటకు తీసి, ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
దిల్లీలో కూడా..
Earthquake in Delhi today : నేపాల్‌లో సంభవించిన తాజా భూకంపంతో దిల్లీ, లక్నో వంటి ఉత్తర భారత ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చింది. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కాగా.. ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
మరోవైపు.. నేపాల్‌లో భూకంపాలు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు అధికంగా నమోదయ్యే ప్రాంతాల్లో నేపాల్ ఒకటి. 2015లో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 9వేల మంది మరణించారు. 22వేల మంది గాయపడ్డారు. ఇళ్లతో పాటు 8వేలకుపైగా పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా.. 10లక్షల మందికి చదువు అందలేదు! నాటి రోజులను అక్కడి ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు.
సంబంధిత కథనం