తెలుగు న్యూస్ / ఫోటో /
అఫ్గానిస్థాన్ భూకంపం ఘటనలో 2వేల మంది మృతి!
- శనివారం ఉదయం సంభవించిన భారీ భూకంపం.. అఫ్గానిస్థాన్‌ను కుదిపేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
- శనివారం ఉదయం సంభవించిన భారీ భూకంపం.. అఫ్గానిస్థాన్‌ను కుదిపేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
(1 / 5)
హెరాత్ ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది.(AP)
(2 / 5)
ఈ ఘటనలో 2వేలకుపైగా మంది మరణించారు. ఫలితంగా.. అఫ్గానిస్థాన్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా ఇది మిగిలిపోయింది! వేలాది మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.(AP)
(3 / 5)
భూకంపం ధాటికి అనేక భవనాలు కూలిపోయాయి. కాగా.. చాలా మంది శిథిలాలను చేతులతో తీసి తమ వారిని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుండటం వైరల్‌గా మారింది.(AP)
(4 / 5)
తాలిబన్లు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 2060 మంది మరణించారు. 1,240మంది గాయపడ్డారు. 1,320 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ నెంబర్లు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.(AP)
ఇతర గ్యాలరీలు