National Herald : నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంలో ఈడీ సోదాలు-national herald office raided by ed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Herald : నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంలో ఈడీ సోదాలు

National Herald : నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంలో ఈడీ సోదాలు

Sharath Chitturi HT Telugu
Aug 02, 2022 01:54 PM IST

National Herald ED : కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇటీవలే ఈడీ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ కేసులో భాగంగా.. నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంతో పాటు 12 ప్రాంతాల్లో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది!

నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంలో ఈడీ సోదాలు
నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంలో ఈడీ సోదాలు

National Herald ED : నేషనల్​ హెరాల్డ్​ కేసు దర్యాప్తులో భాగంగా.. ఢిల్లీలోని ఆ సంస్థకు చెందిన కార్యాలయం ‘హెరాల్డ్​ హౌజ్​’లో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. ఇదే కేసుపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని విచారించిన కొన్ని రోజుల వ్యవధిలో.. ఈడీ ఈ చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నేషనల్​ హెరాల్డ్​ కార్యాలయంతో పాటు ఏజేఎల్​(అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​)కు చెందిన 12 ప్రాంతాల్లో.. ఏకకాలంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. సోదాల అనంతరం.. కేసులో భాగంగా.. ఆస్తుల వివరాలను ఈడీ అటాచ్​ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

తాజా పరిణామాలపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావించి.. ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరకాటంలో పెడుతున్న వేళ.. ఈడీ జోరుగా పనులు చేస్తోందని మండిపడింది. ప్రజలకు సమాధానం ఇవ్వలేకే.. ఈడీని పంపించి.. నేతలను కేంద్రం బెదిరిస్తోందని ఆరోపించింది.

"కాంగ్రెస్​ ఒక్కటే కాదు.. విపక్షాల నేతలు చిత్రహింసలకు గురవుతున్నారు. కాంగ్రెస్​పై దాడి చేసేందుకే నేషనల్​ హెరాల్డ్​ హౌజ్​లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికార పక్షం విద్వేష రాజకీయాలను మేము ఖండిస్తున్నాము. మా గొంతుకను మీరు అణచివేయలేరు," అని కాంగ్రెస్​ వెల్లడించింది.

నేషనల్​ హెరాల్డ్​ కేసులో రెండు నెలలుగా ఈడీ విచారణ జోరుగా సాగుతోంది. జూన్​లో.. రాహుల్​ గాంధీని దాదాపు 6రోజుల పాటు విచారించింది ఈడీ. ఇక జులైలో.. సోనియా గాంధీని రెండుసార్లు విచారించింది. ఇప్పుడు హెరాల్డ్​ కార్యాలయంలో సోదాలు చేసింది.

అసలు నేషనల్​ హెరాల్డ్​ కేసు ఏంటి? గాంధీలను అరెస్ట్​ చేస్తారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం