'డీల్​ కట్​ చేస్తా'- ట్విట్టర్​కు ఎలాన్​ మస్క్​ వార్నింగ్​!-musk threatens to walk away from twitter deal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'డీల్​ కట్​ చేస్తా'- ట్విట్టర్​కు ఎలాన్​ మస్క్​ వార్నింగ్​!

'డీల్​ కట్​ చేస్తా'- ట్విట్టర్​కు ఎలాన్​ మస్క్​ వార్నింగ్​!

Sharath Chitturi HT Telugu
Jun 06, 2022 07:52 PM IST

Elon Musk twitter | అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​.. ట్విట్టర్​ను 44బిలియన్​ డాలర్లకు కొనుగోలు చేశారు. కాగా.. ఇప్పుడు ఆ డీల్​ నుంచి తప్పుకుంటానని ట్విట్టర్​కు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

<p>'డీల్​ కట్​ చేస్తా'- ట్విట్టర్​కు ఎలాన్​ మస్క్​ హెచ్చరిక</p>
<p>'డీల్​ కట్​ చేస్తా'- ట్విట్టర్​కు ఎలాన్​ మస్క్​ హెచ్చరిక</p> (AFP/file)

Elon Musk twitter | ట్విట్టర్​తో కుదుర్చుకున్న 44బిలియన్​ డాలర్ల ఒప్పందం నుంచి తప్పుకుంటానని సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థకు వార్నింగ్​ ఇచ్చారు అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​. స్పామ్​ బాట్​ అకౌంట్లపై సమాచారం ఇవ్వకపోతే.. డీల్​ను కట్​ చేస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు టెస్లా, స్పేస్​ ఎక్స్​ సీఈఓ మస్క్​ లాయర్లు.. ట్విట్టర్​కు సోమవారం ఓ లేఖ పంపించారు. ఇదే విషయాన్ని ఎస్​ఈసీ(సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్​ఛేంజ్​ కమిషన్​)కి కూడా వివరించారు.

ఏప్రిల్​లో ట్విట్టర్​- మస్క్​ మధ్య ఒప్పందం కుదురింది. కాగా.. ట్విట్టర్​లో ఫేక్​ అకౌంట్లు ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ట్విట్టర్​తో డీల్​ను నిలిపేవేశారు మస్క్​. ఫేక్​ ఖాతాల వ్యవహారంపై తమకు సమాచారం ఇవ్వాలని గత నెల 9న తేల్చిచెప్పారు. కానీ ఇప్పటి వరకు ట్విట్టర్​ సరిగ్గా స్పందించకపోవడంతో డీల్​ నుంచి తప్పుకుంటానని మస్క్​ హెచ్చరించారు. కాగా.. మస్క్​కు టెస్టింగ్​ మెథడ్స్​కు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు, కానీ డేటాకు సంబంధించిన అంశాలను పంచుకోలేమని ట్విట్టర్​ చెబుతోంది.

Musk twitter deal | ట్విట్టర్​లో తాను కోరుకున్న మార్పులు చేసేందుకు కావాల్సిన సమాచారాన్ని అడిగినట్టు మస్క్​ చెబుతున్నారు. కానీ తనకు సమాచారం ఇవ్వకపోవడంతో.. ఒప్పందంలోని అంశాలను ట్విట్టర్​ ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ వార్తతో ట్విట్టర్​ షేర్లు సోమవారం ప్రీ-మార్కెట్​ ట్రేడింగ్​లో దాదాపు 5.5శాతం నష్టాల్లో కనిపించాయి.

సంబంధిత కథనం

టాపిక్