Manohar Lal Khattar resigns : హరియాణా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా- కూటమిలో విభేదాలే కారణం?
Manohar Lal Khattar : మనోహర్ లాల్ ఖట్టర్.. హరియాణా సీఎం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ- జేజేపీ కూటమి మధ్య విభేదాలే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
Manohar Lal Khattar resigns : హరియాణా రాజకీయాల్లో పెను సంక్షోభం! హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు.. తన రాజీనామా లేఖను హరియాణా గవర్నర్‌కి మంగళవారం ఉదయం అందించినట్టు సమాచారం. అధికార బీజేపీ- జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్న తరుణంలో.. ఖట్టర్ రాజీనామా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఖట్టర్‌తో పాటు ఆయన కేబినెట్ కూడా రాజీనామా చేసింది.

బీజేపీ- జేజేపీ మధ్య విభేదాలే కారణామా?
హరియాణా సీఎంగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఉండగా.. డిప్యూటీ సీఎం పదవిలో జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలా కొనసాగుతున్నారు. అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో వీరి మధ్య విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. సీట్ల సద్దుబాటు విషయం ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం గమనార్హం.
Haryana CM Manohar Lal Khattar : మరోవైపు బీజేపీ- జేజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు స్వతంత్ర ఎమ్మెల్యే నయన్ పాల్ రావత్. బీజేపీ- జేజేపీ కూటమి పతనం అంచున ఉందన్నారు. కానీ స్వతంత్ర ఎమ్మెల్యేలు.. బీజేపీకి మద్దతిస్తారని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు.. హరియాణ సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు వేరువేరుగా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఖట్టర్ కూడా.. బీజేపీ మంత్రులతో ఇంకొద్ది సేపట్లో సమావేశమవుతారని తెలుస్తోంది.
అయితే.. మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా వెనుక ఉన్న అసలు విషయం బయటకు రావడం లేదు. బీజేపీ పెద్దలు ఈ విషయంపై మౌనంగానే ఉంటున్నారు!
నెంబర్ గేమ్ ఇలా..
Haryana politics latest news : హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 40 సీట్లు కావాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 31 చోట్ల గెలిచింది. దుశ్యంత్ చౌతాలా జేజేపీకి 10 సీట్లు దక్కాయి. చివరికి.. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
హరియాణాలో మొత్తం 10 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో గెలిచింది. జేజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంతే!
ఇప్పుడేం జరుగుతుంది..?
మీడియా కథనాల ప్రకారం.. మనోహర్ లాల్ ఖట్టార్.. హరియాణా సీఎంగా మంగళవారం సాయంత్రం తిరిగి ప్రమాణం చేయొచ్చు. ఈసారి.. ఆయనకు 7 ఏడుగురు స్వతంత్రుల మద్దతు ఉంటుంది. అదే కాకుండా.. జేజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు.. బీజేపీకి మద్దతు ప్రకటించేందుక సిద్ధంగా ఉన్నారు.
సంబంధిత కథనం