Manipur video : మణిపూర్‌లో మరో దారుణం.. వ్యక్తి తల నరికి, వేలాడదీసి!
Manipur video : మణిపూర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు.. కుకి జాతికి చెందిన ఓ వ్యక్తిని చంపి, అతని తల నరికారు. అనంతరం ఇంటి ముందు ఫెన్సింగ్‌కి వేలాడదీశారు.
Manipur video : హింసాత్మక ఘటనలతో దాదాపు మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో దారుణం! కుకి జాతికి చెందిన ఓ వ్యక్తిని, కొందరు దుండగులు దారుణంగా చంపి, శరీరం నుంచి తలను వేరు చేశారు. అనంతరం దానిని ఇంటి ముందు వేలాడదీసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు తాజాగా వైరల్ అయ్యాయి.
ఇదీ జరిగింది..
మణిపూర్‌లో.. కుకి జాతికి చెందిన ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్‌తో పాటు వారిని నగ్నంగా చేసి ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన మే 4న జరగ్గా.. కొన్ని రోజుల క్రితమే వీడియో బయటపడింది. ఇక ఈ ఘటన కలకలం సృష్టించిన కొన్ని రోజులకే, అంటే శుక్రవారం నాడు.. శరీరం నుంచి వేరు చేసిన ఓ వ్యక్తి తలకు సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.
సంబంధిత ఘటన చూరచంద్రాపుర్లోని లమ్జా గ్రామంలో జులై 2న జరిగినట్టు తెలుస్తోంది. మృతుడి పేరు డేవిడ్ థైక్. వాస్తవానికి ఉద్యోగం కోసం అతను ముంబైకి వెళ్లాల్సి ఉంది. కానీ మణిపూర్ ఘర్షణల కారణంగా అతను గ్రామంలోనే ఉండిపోయాడు.
Manipur violence : పోలీసుల కథనం ప్రకారం.. సంబంధిత గ్రామంలో దుండగుల దాడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఊరిలోని వారు ఒకరి తర్వాత ఒకరు కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జులై 2 తెల్లవారుజామున థైక్ కాపలా కాశాడు. 5 గంటలకు.. ఓ గుంపు, ఆయుధాలతో థైక్పై దాడి చేసింది. తుపాకీతో అతడిని కాల్చిన దుండగులు.. ఆ తర్వాత శరరం నుంచి తలను వేరు చేశారు. ఒక కన్నును పీకేశారు. అనంతరం ఆ తలను ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్‌కు వేలాడదీశారు. అంతటితో ఆగకుండా.. తల లేని శరీరంపై అనేక మార్లు కత్తితో పొడిచారు.
"ఘటన జరిగిన కొన్ని క్షణాల ముందు.. ఓ మహిళ, ఆమె ఇద్దరి బిడ్డలను థైక్ రక్షించాడు. దుండగుల దాడి చేస్తుండగా.. ఆ ముగ్గురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత తన స్నేహితుడు స్కూటర్‌ను తీసుకురావడానికి వెళ్లాడు. స్కూటర్‌పై వారిద్దరు గ్రామం నుంచి బయటకు వెళ్లిపోవాలన్నది ప్లాన్. కానీ స్కూటర్ వచ్చే ముందే, అతనిపై గుంపు దాడి చేసింది," అని ఐటీఎల్ఎఫ్ (ఇండిజీనియస్ ట్రైబల్ లీడర్స్ ఫార్మ్) సభ్యురాలు మేరీ వెల్లడించారు.
Manipur crime news : "థైక్ కుటుంబానికి అతనే దిక్కు. 2020 వరకు ముంబైలోని ఓ హోటల్లో పనిచేసే వాడు. 2020లో ఇంటికి వచ్చాడు. మళ్లీ ఇప్పుడు వెళదామని సన్నద్ధమవుతుండగా.. మణిపూర్‌ల ఘర్షణలు మొదలయ్యాయి. ఇంట్లో ఉండిపోయాడు. చివరికి ఇలా జరిగింది," అని మేరీ తెలిపారు.
మరోవైపు థైక్ బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కానీ పోలీసులు ఇంకా ఈ ఘటనపై స్పందించలేదని బంధువులు చెబుతున్నారు.
సంబంధిత కథనం