Makara Jyothi Darshanam 2024 : శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’-makara jyothi darshanam 2024 at sabarimala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Makara Jyothi Darshanam 2024 : శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’

Makara Jyothi Darshanam 2024 : శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 15, 2024 07:34 PM IST

Sabarimala Makara Jyothi Darshanam 2024 Updates : శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై జ్యోతి కనిపించింది.

శబరిమలలో మకరజ్యోతి దర్శనం
శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Sabarimala Ayyappa Makara Jyothi Darshanam 2024: శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడుపై భక్తులకు మకరజ్యోతి మూడు సార్లు కనిపించింది. జ్యోతి దర్శన సమయంలో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి.జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 6.00 నుంచి 07.00 గంటల మధ్య జ్యోతి దర్శనమిచ్చింది. ఇక మకరజ్యోతి దర్శన నేపథ్యంలో… శబరిమలలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయానికి వస్తుంటారు. జ్యోతి దర్శనం కోసం అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతారు. దీంతో శబరిమల మకరజ్యోతి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే శబరిమల మకరజ్యోతి ఘట్టం 2-3 నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం. శబరిమల కొండపై శబరిమల మకరజ్యోతి దర్శనం రోజున యాత్రికుల ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలో మాత్రమే జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

శబరిమల మకరవిళక్కు... శబరిమల ఆలయ బోర్డు నిర్వహించబడే ఒక కార్యక్రమం, భక్తులు శబరిమల ఆలయం నుంచి నేరుగా శబరిమల మకరజ్యోతిని వీక్షించవచ్చు. మకర జ్యోతి వీక్షించేందుకు భక్తుల కోసం ఆలయ అధికారులు వివిధ వ్యూ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. భక్తులు శబరిమల మకరవిళక్కును టీవీలలో వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి దర్శనానికి 4 నుంచి 5 లక్షల మంది అయ్యప్ప భక్తులు వచ్చినట్లు అంచనా.

Whats_app_banner