Maratha reservation: ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్ర రైతుల్లో 94 శాతం మరాఠాలే..-maharashtra reservation panel report says 21 22 percent marathas below poverty line ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maratha Reservation: ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్ర రైతుల్లో 94 శాతం మరాఠాలే..

Maratha reservation: ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్ర రైతుల్లో 94 శాతం మరాఠాలే..

HT Telugu Desk HT Telugu
Feb 21, 2024 11:37 AM IST

Maharashtra reservation: మహారాష్ట్ర వెనుక బడిన వర్గాల కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో సంచలన వాస్తవాలు వెల్లడయ్యాయి. మరాఠాల్లో 21 శాతం పైగా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారని నివేదిక తెలిపింది.

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న మరాఠాలు (ఫైల్ ఫొటో)
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న మరాఠాలు (ఫైల్ ఫొటో)

Maratha reservation: మహారాష్ట్రలోని మరాఠా సామాజిక వర్గానికి చెందిన వారిలో 21.22% మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 94% మంది మరాఠాలేనని కమిషన్ రూపొందించిన నివేదిక తెలిపింది.

21.22 శాతం మరాఠాలు దారిద్య్రరేఖ దిగువన..

మహారాష్ట్ర స్టేట్ కమీషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (MSCBC) నివేదిక రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరాఠాల వెనుకబాటుపై సాధికార వివరాలను సమర్పించింది. తద్వారా విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు 10% రిజర్వేషన్లు కల్పించడం సబబేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరాఠా జనాభా 28% ఉందని, వారిలో 21.22% మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని, రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సగటు 17.4% కాగా, మరాఠాలు అంతకంటే చాలా ఎక్కువగా 21.22% ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. అదనంగా, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 94% మరాఠా సమాజానికి చెందినవారని ఆ నివేదిక వెల్లడించింది. 84% మరాఠాలు నాన్-క్రీమీ లేయర్ కేటగిరీ కిందకు వస్తారని తెలిపింది. వారి వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉందని నివేదిక సూచిస్తుంది.

సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా..

సామాజిక, ఆర్థిక, విద్యా పారామితుల ఆధారంగా కమిషన్ నివేదికను రూపొందించింది. ఇందులో 250కి 170 పాయింట్లను కేటాయించి, వెనుకబాటుతనం ఆధారంగా మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పించాలని సూచించింది. 154 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని రూపొందించి, సమాధానాలను రాబట్టింది. సామాజిక వెనుకబాటుకు 110 పాయింట్లు, విద్యాపరమైన వెనుకబాటుకు 80 పాయింట్లు, ఆర్థిక వెనుకబాటుకు 60 పాయింట్లతో మూడు సబ్‌కేటగిరీలుగా విభజించారు. మరాఠాల ఆర్థిక వెనుకబాటుతనంపై 60కి 50 పాయింట్లు, విద్యా పారామితులపై 80కి 40, సామాజిక పారామితులపై 110కి 80 పాయింట్లు మరాఠాలకు కల్పించింది. రాష్ట్రంలో మరాఠాల ఆదాయం తగ్గిపోవడానికి పంటల వైఫల్యం ప్రధాన కారణమని తెలిపింది.

1.5 లక్షల కుటుంబాల సర్వే

మహారాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ జనవరి 23 నుండి ఫిబ్రవరి 2 వరకు 1.58 లక్షల కుటుంబాలపై సర్వే నిర్వహించింది, 154 ప్రశ్నలను ఉపయోగించి 1.96 లక్షల ఎన్యుమరేటర్ల సహాయంతో. మరాఠా కమ్యూనిటీలో ముఖ్యంగా మాధ్యమిక, ఉన్నత, వృత్తిపరమైన విద్యలో తక్కువ విద్యా స్థాయిలను ఈ నివేదిక వెల్లడించింది. ఆర్థిక వెనుకబాటుతనం విద్యకు ఒక ముఖ్యమైన అవరోధంగా పనిచేస్తుందని, తరచుగా పేదరికానికి దారితీస్తుందని ఇది నొక్కి చెబుతుంది. ఓపెన్ కేటగిరీకి చెందిన 18.09% మంది (ఇందులో మరాఠాలు కూడా) దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా, మరాఠాలలో 21.22% శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వివిధ రంగాలలో ఉపాధిలో మరాఠాలకు తగిన ప్రాతినిధ్యం లేదని తెలిపింది.

రైతు ఆత్మహత్యలు

2018లో MSCBC సమర్పించిన నివేదికలో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో మరాఠాలు 30% ఉన్నారని తేలింది. వారిలో 76.86% కుటుంబాలు వ్యవసాయ రంగంలో ఉన్నాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం మరాఠాలకు SEBC రిజర్వేషన్ ఈ నివేదిక ఆధారంగానే ఇచ్చారు. 2013 నుండి 2018 వరకు, ఆ కాలంలో జరిగిన మొత్తం రైతు ఆత్మహత్యలలో 23.56% మరాఠా రైతుల ఆత్మహత్యలే.

Whats_app_banner