Helicopter crash: పుణె సమీపంలో కుప్పకూలిన హెలీకాప్టర్; ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం-maharashtra news hyderabad bound private helicopter from mumbai crashes in pune ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Helicopter Crash: పుణె సమీపంలో కుప్పకూలిన హెలీకాప్టర్; ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

Helicopter crash: పుణె సమీపంలో కుప్పకూలిన హెలీకాప్టర్; ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 05:11 PM IST

Helicopter crash: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు హెలీకాప్టర్ పుణె సమీపంలో కుప్పకూలింది. ప్రమాదం సమయంలో ఆ చాపర్ లో పైలట్ సహా నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో వారికి గాయాలయ్యాయని, వారిలో కెప్టెన్ పరిస్థితి విషమంగా ఉందని పుణె ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు.

పుణె సమీపంలో కుప్పకూలిన హెలీకాప్టర్; ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
పుణె సమీపంలో కుప్పకూలిన హెలీకాప్టర్; ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం (X/@ANI)

Helicopter crash: మహారాష్ట్రలోని పుణె జిల్లా ముల్షి తహసీల్ లోని పౌడ్ గ్రామ సమీపంలో ఆగస్టు 24న ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్, పుణె రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆ ప్రైవేట్ హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో వారికి గాయాలయ్యాయి.

కెప్టెన్ కు తీవ్ర గాయాలు

హెలికాప్టర్ లో ఉన్న నలుగురిలో కెప్టెన్ కు తీవ్ర గాయాలయ్యాయని, ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. ఈ హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

వారం క్రితం నేపాల్ లో..

నేపాల్ (Nepal) రాజధాని ఖాట్మండుకు వాయవ్యంగా ఉన్న పర్వతాల సమీపంలో ఆగస్టు 7న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు పురుషులు, ఒక మహిళ మృతి చెందారు. శిథిలాల నుంచి నలుగురు పురుషులు, ఒక మహిళ మృతదేహాలను వెలికితీశామని నువాకోట్ జిల్లా ప్రభుత్వ అడ్మినిస్ట్రేటర్ కృష్ణ ప్రసాద్ హుమగై తెలిపారు. పోలీసులు, ఆర్మీ రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ఆపరేషన్లో సహాయపడటానికి రెండు రెస్క్యూ హెలికాప్టర్లను కూడా పంపినట్లు అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక కాలమానం ప్రకారం ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 1.54 గంటలకు ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సప్రుబేషి పట్టణానికి ఆ చాపర్ వెళ్తోంది. నేపాల్ లోని ఎయిర్ డైనాస్టీ కి చెందిన యూరోకాప్టర్ ఏఎస్ 350 హెలికాప్టర్ టేకాఫ్ అయిన మూడు నిమిషాల్లోనే టవర్ తో సంబంధాలు తెగిపోయాయి. ఇటీవల మే 20న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్ బైజాన్ దేశ సరిహద్దులోని జోల్ఫా నగరం సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, పొగమంచు, గాలులు హెలికాప్టర్ ప్రమాదానికి కారణమయ్యాయని, కొందరు దీనిని హార్డ్ ల్యాండింగ్ గా అభివర్ణించారని స్థానిక మీడియా పేర్కొంది.