Bus accident: నేపాల్ లో నదిలో పడిన బస్సు; 14 మంది భారతీయుల మృతి-14 killed 16 injured and more missing after a bus with indian pilgrims drives off a nepal highway ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bus Accident: నేపాల్ లో నదిలో పడిన బస్సు; 14 మంది భారతీయుల మృతి

Bus accident: నేపాల్ లో నదిలో పడిన బస్సు; 14 మంది భారతీయుల మృతి

HT Telugu Desk HT Telugu
Aug 23, 2024 03:18 PM IST

Bus accident: నేపాల్ హైవేపై భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీలోని గోరఖ్ పూర్ నుంచి 50 మంది భక్తులతో ఈ బస్సు నేపాల్ వెళ్లింది.

నేపాల్ లో నదిలో పడిన బస్సు
నేపాల్ లో నదిలో పడిన బస్సు (PTI)

Bus accident: నేపాల్ లోని ప్రధాన రహదారిపై భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 14 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి పృథ్వీ హైవే పక్కనే లోతైన లోయలో ప్రవహిస్తున్న యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారని, 16 మంది గాయపడ్డారని ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి శైలేంద్ర థాపా తెలిపారు.

మరణాలు సంఖ్య పెరిగే అవకాశం

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇంకా ఎంత మంది గల్లంతయ్యారో, ఎంతమంది ఉన్నారో అధికారులు ఇంకా చెప్పలేదు. కానీ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ఉన్నారని వారు అంచనా వేశారు. రాజధాని ఖట్మాండూ కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుఖైరేని పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రజలను బయటకు తీసేందుకు పోలీసులు, ఆర్మీ రెస్క్యూ సిబ్బంది సహాయం చేస్తున్నారు.

యూపీ నుంచి భక్తులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ కు చెందిన బస్సు నేపాల్ లో రిసార్ట్ పట్టణం పోఖారా నుంచి ఖాట్మండు వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. నేపాల్ లో దేవాలయాల సందర్శనకు సుమారు 50 మంది భక్తులతో ఈ బస్సు గోరఖ్ పూర్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఇదే ప్రాంతంలో జూలై నెలలో కూడా ప్రమాదం జరిగింది. అప్పుడు, రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ఆ రెండు బస్సుల్లో ఉన్న 65 మందిలో ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సగం మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఆ బస్సుల శిథిలాల కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.

నేపాల్ లో బస్సు ప్రమాదాలు ఎక్కువ

నేపాల్ లో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కారణం, అక్కడ రోడ్ల నిర్వహణ, మరమ్మతులు సరిగ్గా ఉండవు. కాలం చెల్లిన వాహనాలు ప్రమాదకర రహదారుల గుండా ప్రయాణిస్తుంటాయి. నేపాల్ లో ఎక్కువగా పర్వత పాద ప్రాంతాలలో ఇరుకైన రహదారులు ఉంటాయి.

Whats_app_banner