Dry days : మద్యం ప్రియులకు అలర్ట్​! ఆ 4 రోజులు లిక్కర్​ దుకాణలు బంద్​..-maharashtra assembly elections 2024 dry days in mumbai on these dates details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dry Days : మద్యం ప్రియులకు అలర్ట్​! ఆ 4 రోజులు లిక్కర్​ దుకాణలు బంద్​..

Dry days : మద్యం ప్రియులకు అలర్ట్​! ఆ 4 రోజులు లిక్కర్​ దుకాణలు బంద్​..

Sharath Chitturi HT Telugu
Nov 17, 2024 09:00 AM IST

Maharashtra Assembly Elections : 2024 నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ముంబైలో వరుస డ్రై డేస్​ని మద్యం ప్రియులు ఎదుర్కోనున్నారు! ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు నవంబర్ 18 నుంచి నవంబర్ 23 వరకు 4 రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు.

ఈ 4 రోజులు మద్యపానంపై నిషేధం..
ఈ 4 రోజులు మద్యపానంపై నిషేధం..

2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ముంబై నగరం సహా ఇతర ప్రాంతాల్లోని మద్యం ప్రియులకు బ్యాడ్​ న్యూస్​! ఈ నెలలో వరుస డ్రై డేస్​ ఉండనున్నాయి!

డ్రై డేస్ అనేది ఒక ప్రాంతంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించిన నిర్దిష్ట రోజులను సూచిస్తుంది. సాధారణంగా ముఖ్యమైన జాతీయ, మత లేదా సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో మద్యం విక్రయాలను నిలిపివేస్తారు. అయితే 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబై, ఇతర నగరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్జ రుగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముంబై, ఇతర నగరాల్లో మద్యపాన నిషేధానికి ఈసీ ఇచ్చిన షెడ్యూల్​..

నవంబర్ 18: ముంబై, ఇతర నగరాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం అమ్మకాలను నిషేధించనున్నారు.

నవంబర్ 19: కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ముంబైలో పూర్తి డ్రై డే పాటించనున్నారు.

నవంబర్ 20: పోలింగ్ రోజున ముంబైలో సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది.

నవంబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఆరోజు సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు.

మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో, శాంతిభద్రతలను కాపాడటానికి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రై డేస్ నిర్వహిస్తారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా బీఎంసీ పరిధిలోని వ్యాపారాలు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ నవంబర్ 20న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సెలవు ప్రకటించింది. ఆ రోజున దేశీయ స్టాక్​ మార్కెట్​లకు (బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ) సైతం సెలవు ఉంటుంది.

ఆదేశాలను పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రానీ స్పష్టం చేశారు. నవంబర్ 20న సెలవు తీసుకునే ఉద్యోగులకు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు, వేతన కోతలు ఉండవని, ఎలాంటి పరిణామాలు లేకుండా ఓటు వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం