LIC IPO |ఇవాళే ఎల్​ఐసీ ఐపీఓ ఓపెన్​- ఈ వివరాలు మీకోసమే-lic ipo open today here what you need to know before applying ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lic Ipo |ఇవాళే ఎల్​ఐసీ ఐపీఓ ఓపెన్​- ఈ వివరాలు మీకోసమే

LIC IPO |ఇవాళే ఎల్​ఐసీ ఐపీఓ ఓపెన్​- ఈ వివరాలు మీకోసమే

HT Telugu Desk HT Telugu
May 04, 2022 09:04 AM IST

LIC IPO | ఎల్​ఐసీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​.. ఇవాళ ఓపెన్​ కానుంది. అప్లై చేసుకునే ముందు ఐపీఓ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

<p>నేడే ఎల్​ఐసీ ఐపీఓ ఓపెన్</p>
నేడే ఎల్​ఐసీ ఐపీఓ ఓపెన్

LIC IPO details | స్టాక్​ మార్కెట్​ వర్గాలతో పాటు దేశప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్​ఐసీ ఐపీఓ.. ఇవాళ సబ్​స్క్రిప్షన్​ కోసం ఓపెన్ కానుంది. ఫలితంగా ఏడాది నిరీక్షణకు తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఎల్​ఐసీ ఐపీఓ వివరాలతో పాటు, ప్రస్తుత గ్రే మార్కెట్​ విశేషాలను ఓసారి చూద్దాం..

ఎల్​ఐసీ ఐపీఓ వివరాలు..

ఐపీఓ సైజు:- రూ. 21వేల కోట్లు (దేశంలోనే అతిపెద్ద ఐపీఓ)

ఐపీఓ డేట్​:- మే 4- మే 9

ఐపీఓ ప్రైజ్​:- రూ. 902- రూ. 949/షేరు. కచ్చితంగా షేర్లు అలాట్​ అవ్వాలంటే.. అప్పర్​ బ్యాండ్​(రూ. 949)తో బిడ్లు వేయడం ఉత్తమం.

అప్లికేషన్​ లిమిట్​:- ఒక వ్యక్తి.. 14 ఐపీఓ బిడ్లను అప్లై చేసుకోవచ్చు.

పాలసీదారులకు డిస్కౌంట్​:- షేరు మీద రూ. 60

ఎల్​ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్​:- షేరు మీద రూ. 45

అలాట్​మెంట్​ డేట్:- మే 12

ఐపీఓ లిస్టింగ్​:- మే 17 (బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ)

యాంకర్​ బుక్​కు భారీ డిమాండ్​

ఐపీఓకు ముందు.. ప్రభుత్వానికి గుడ్​ న్యూస్​ అందింది. ఎల్​ఐసీ ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు యాంకర్​ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు! మొత్తం మీద యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచే రూ. 5,620కోట్లు ఎల్​ఐసీకి దక్కాయి.

హై ప్రొఫైల్​తో కూడిన ఇన్ట్సిట్యూషనల్​ ఇన్వెస్టర్లను యాంకర్​ ఇన్వెస్టర్లు అని అంటారు. కాగా.. ఇతర ఇన్వెస్టర్లులాగా కాకుండా.. వీరికి లాకిన్​ పీరియడ్​ ఉంటుంది. అంటే.. లిస్టింగ్​ అయిన కొన్ని రోజుల వరకు.. వీరు తమ స్టాక్స్​ను అమ్ముకోలేరు. సాధారణంగా.. ఏ ఐపీఓకైనా.. రిటైలర్ల సబ్​స్క్రిషన్​కు కొన్ని రోజుల ముందు.. యాంకర్​ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయిస్తారు. యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందనతో ఐపీఓకు ఉన్న డిమాండ్​ను మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తూ ఉంటాయి.

ఎల్​ఐసీ ఐపీఓ, సంస్థ పనితీరుపై ఎఫ్​ఐఐల్లో ఆందోళన నెలకొంది. కాగా.. ప్రపంచంలోని పెన్షన్​ ఫండ్స్​ మాత్రం ఐపీఓపై ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది.

Whats_app_banner

టాపిక్