LIC IPO | కౌంట్‌డౌన్ షురూ.. సెబీ చేతికి ముసాయిదా పత్రాలు
LIP IPO news | దేశప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది కేంద్రం. మొత్తం 5శాతం వాటాను ఐపీఓలోకి తీసుకొచ్చింది. ఆ విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.
LIC IPO date | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ ఎల్ఐసీ ఐపీఓకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బీమా సంస్థ ఐపీఓకు సంబంధించి.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద ఆదివారం ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మార్చ్ నెలలో ఈ ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
మొత్తం మీద 31.6కోట్ల ఈక్విటీ షేర్ల(5శాతం) వాల్యుయేషన్‌తో సెబీ వద్దుకు వెళ్లింది కేంద్రం. 2021 సెప్టెబర్ 30 నాటికి ఈ 5శాతం షేర్ల విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.
LIC IPO | ఈ బీమా సంస్థకు 66శాతం మార్కెట్ వాటా ఉంది. మొత్తం మీద 283మిలియన్ పాలసీలు కంపెనీ వద్ద ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.35 మిలియన్ మంది ఏజెంట్లు ఉన్నారు.
అయితే.. ఐపీఓలో పాలసీదారులకు, ఉద్యోగులకు ఏవైనా డిస్కౌంట్లు ఉంటాయా? అన్న విషయంపై ప్రభుత్వం దాఖలు చేసిన ముసాయిదా పత్రాల్లో ఎలాంటి స్పష్టత లేదు. అదే సమయంలో.. ఎల్ఐసీ పూర్తి వాల్యుయేషన్‌ను సైతం ప్రభుత్వం చెప్పలేదు.
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఇటీవలే ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించింది. అదే సమయంలో ఎల్ఐసీ ఐపీఓను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఐపీఓ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని దలాల్ స్ట్రీట్, వ్యాపారవేత్తలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం