Heeraben Modi last rites : హీరాబెన్​ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన మోదీ-last rites of heeraben modi mother of pm modi were performed in gandhinagar today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heeraben Modi Last Rites : హీరాబెన్​ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన మోదీ

Heeraben Modi last rites : హీరాబెన్​ అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన మోదీ

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 30, 2022 10:40 AM IST

Heeraben Modi last rites : గుజరాత్​ గాంధీనగర్​లోని ఓ శ్మశానవాటికలో హీరాబెన్​ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తల్లికి తుది వీడ్కోలు పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

తల్లి హీరాబెన్​ మోదీ పాడె మోసిన ప్రధాని మోదీ..
తల్లి హీరాబెన్​ మోదీ పాడె మోసిన ప్రధాని మోదీ.. (PTI)

Heeraben Modi last rites : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హీరాబెన్​ మోదీ పాడె మోసిన ప్రధాని.. గాంధీనగర్​లోని ఓ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మోదీ కుటుంబసభ్యులు సైతం.. హీరాబెన్​కు తుది వీడ్కోలు పలికారు.

100ఏళ్ల హీరాబెన్​ మోదీ.. అనారోగ్యం కారణంతో చికిత్స పొందుతూ.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితమే.. అహ్మదాబాద్​లోని యూఎన్​ మెహ్తా హార్ట్​ హాస్పిటల్​లో చేరారు హీరాబెన్​. ఆ సమయంలో మోదీ కూడా ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హీరాబెన్​ మోదీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకటి- రెండు రోజుల్లో డిశ్ఛార్జ్​ కూడా అవుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు మోదీ.

ఢిల్లీ నుంచి గాంధీనగర్​కు..

PM Modi Mother Heeraben Death : తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ.. ఢిల్లీ నుంచి గుజరాత్​కు బయలుదేరి వెళ్లారు. అహ్మదాబాద్​ విమానాశ్రయంలో దిగిన మోదీ.. నేరుగా గాంధీనగర్​లోని హీరాబెన్​ నివాసానికి వెళ్లారు. ఆ సమయానికే హిరాబెన్​ పార్థివదేహం సైతం అక్కడికి చేరుకుంది. అనంతరం తల్లి పాడె మోసిన ప్రధాని.. హీరాబెన్​ భౌతికకాయాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తల్లికి నివాళులర్పించారు. మోదీ కుటుంబసభ్యులు సైతం హీరాబెన్​ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.

అనంతరం.. హీరాబెన్​ మోదీ పార్థివదేహాన్ని గాంధీనగర్​లోని ఓ శ్మశానవాటికకు తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కుటుంబసభ్యులు.. హీరాబెన్​కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Heeraben Modi death : గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​, మాజీ సీఎం విజయ్​ రూపాణి, కేబినెట్​ మంత్రులు.. హీరాబెన్​ అంత్యక్రియలకు హాజరయ్యారు.

కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో పాటు విపక్షాలకు చెందిన పలువురు నేతలు సైతం హీరాబెన్​ మృతి పట్ల సంతాపం తెలిపారు. కష్టకాలంలో మోదీ ధైర్యంగా ఉండాలని సానుభూతి ప్రకటించారు.

"ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణ వార్త విని బాధ కలిగింది. ఓ వ్యక్తి జీవితంలో మొదటి స్నేహం, మొదటి టీచర్​ మాతృమూర్తే. అలాంటి తల్లి కోల్పోవడం అనేది. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన విషయం. కుటుంబాన్ని పోషించడం కోసం హీరా బా పడిన కష్టాలు స్ఫూర్తిదాయకం. ఆమె త్యాగాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఈ కష్టకాలంలో దేశం మొత్తం మోదీకి అండగా నిలుస్తుంది," అని ట్వీట్​ చేశారు అమిత్​ షా.

వర్చువల్​గా..

PM Modi latest news : వాస్తవానికి.. ప్రధాని మోదీ.. నేడు పశ్చిమ్​ బెంగాల్​కు వెళ్లాల్సి ఉంది. అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించాల్సి ఉంది. తల్లి మరణం నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లడం కుదరలేదు. అయితే.. ఆ ప్రాజెక్టులను.. మోదీ వర్చువల్​గా లాంచ్​ చేస్తారని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం