PM Modi Mother Heeraben Death : ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్​ కన్నుమూత-prime minister narendra modi s mother heeraben modi passed away at the age of 100 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Mother Heeraben Death : ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్​ కన్నుమూత

PM Modi Mother Heeraben Death : ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్​ కన్నుమూత

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 30, 2022 10:30 AM IST

Heeraben Modi passed away : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా తెలిపారు ప్రధాని.

ప్రధాని మోదీతో హీరాబెన్​ మోదీ
ప్రధాని మోదీతో హీరాబెన్​ మోదీ (PTI)

Heeraben Modi passed away : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి, 100ఏళ్ల హీరాబెన్​ మోదీ.. గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

"ఒక అద్భుతమైన 100ఏళ్ల కాలం.. దేవుడి పాదాల వద్దకు చేరింది. అమ్మలో నిస్వార్థ కర్మయోగి, జీవితాకాని కావాల్సిన విలువలను చూశాను. 100వ జన్మదినం నాడు నేను అమ్మని చూసినప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. అది నేను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను. ఇంటెలిజెన్స్​తో పని చేయ్యి, స్వచ్ఛతగా జీవించు అని చెప్పింది," అని మోదీ అన్నారు.

Heeraben Modi death : 100ఏళ్ల హీరాబెన్​ మోదీ.. అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం అహ్మదాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త తెలుసుకున్న ప్రధాని.. ఢిల్లీ నుంచి వెంటనే అహ్మదాబాద్​కు వెళ్లి ఆమెను పరామర్శించారు. వైద్యులతో ఆమె ఆరోగ్యం గురించి చర్చించారు. హీరాబెన్​ మోదీ కోలుకుంటున్నారని, ఒకటి- రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్ఛ్​ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం వెల్లడించారు మోదీ.

యూఎన్​ మెహ్తా హార్ట్​ హాస్పిటల్​ వర్గాల ప్రకారం.. హీరాబెన్​ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ సోదరుడు పంకజ్​ మోదీతో కలిసి గాంధీనగర్​లని రాయ్​సన్​ అనే గ్రామంలో నివాసముండేవారు హీరాబెన్​ మోదీ.

PM Modi Heeraben Modi : హీరాబెన్​ మోదీతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు గుజరాత్​ వెళ్లినా.. తల్లితో గడుపుతారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకుని వెళతారు. పుట్టిన రోజు సందర్భంగానూ.. తల్లి వద్దకు వెళ్లి మిఠాయిలు తినిపించే వారు మోదీ.

ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ.. గుజరాత్​కు బయలుదేరారు. వాస్తవానికి.. షెడ్యూల్​ ప్రకారం ఆయన నేడు పశ్చిమ్​ బెంగాల్​కు వెళ్లాల్సి ఉంది. అక్కడ కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను లాంచ్​ చేయాల్సి ఉంది. కాగా.. గుజరాత్​ నుంచి ఈ కార్యక్రమాల్లో ఆయన వర్చువల్​గా పాల్గొంటారని సమాచారం.

Heeraben Modi passed away in Gujarat : "ప్రధాని మోదీ అహ్మదాబాద్​కు బయలుదేరారు. కానీ హౌరాలో జరగాల్సిన వందే భారత్​ ట్రైన్​ లాంచ్​తో పాటు కోల్​కతాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్కరణ.. ప్లాన్​ ప్రకారమే జరుగుతాయి. మోదీ వర్చువల్​గా ఈ ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉంది," అని సంబంధిత వర్గాలు.. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్​ఐకి వెల్లడించాయి.

ప్రధాని మోదీ తల్లి మరణం పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్