PM Modi visited mother Heeraben: హాస్పిటల్ కు చేరుకున్న ప్రధాని మోదీ-pm modi visited mother heeraben who is admitted to ahmedabad hospital
Telugu News  /  National International  /  Pm Modi Visited Mother Heeraben, Who Is Admitted To Ahmedabad Hospital
మాతృమూర్తి హీరాబెన్ తో ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
మాతృమూర్తి హీరాబెన్ తో ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

PM Modi visited mother Heeraben: హాస్పిటల్ కు చేరుకున్న ప్రధాని మోదీ

28 December 2022, 21:18 ISTHT Telugu Desk
28 December 2022, 21:18 IST

PM Modi visited mother Heeraben: అస్వస్థతతో అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మని చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వెళ్లారు.

PM Modi visited mother Heeraben: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ స్వల్ప అస్వస్థతకు లోను కావడంలో, ఆమెను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ (UN Mehta Institute of Cardiology and Research Centre) లో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హాస్పిటల్ ఒక హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. అయితే, ఆమె అనారోగ్యంపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

PM Modi visited mother Heeraben: హాస్పిటల్ కు ప్రధాని మోదీ..

తల్లి అనారోగ్య సమాచారం తెలియగానే, అన్ని షెడ్యూల్డ్ అపాయింట్ మెంట్స్ ను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ.. వెంటనే అహ్మదాబాద్ బయల్దేరారు. అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా హాస్పిటల్ లోకి మోదీ కాన్వాయ్ వెళ్తున్న వీడియోను పలు వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. హీరా బెన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆమెను ఆసుపత్రిలో చేర్చారని స్థానిక మీడియా తెలిపింది. హీరాబెన్ మోదీ జూన్ 18, 1923లో జన్మించారు. 2023 జూన్ 10కి ఆమె 100 వసంతాలు పూర్తి చేసుకుంటారు.

PM Modi visited mother Heeraben: తల్లితో అనుబంధం

తన తల్లితో తనకున్న అనుబంధం గురించి ప్రధాని మోదీ చాలాసార్లు ప్రస్తావించారు. గత సంవత్సరం జూన్ లో హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమెతో తనకున్న అనుబంధాన్ని మోదీ వెల్లడించారు. ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అహ్మదాబాద్ వచ్చిన సమయంలోనూ.. మాతృమూర్తి ని కలిసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు.

PM Modi visited mother Heeraben: గెట్ వెల్ సూన్ సందేశాలు

ప్రధాని మోదీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలన్న సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపించారు. పీఎం మోదీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తల్లీ, కొడుకుల అనుబంధం చాలా విలువైనదని రాహుల్ ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు.