Safest city Kolkata: దేశంలో అత్యంత సేఫ్ సిటీ కోల్ కతా.. మూడో స్థానంలో హైదరాబాద్-kolkata declared safest city in india for third consecutive year ncrb report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Safest City Kolkata: దేశంలో అత్యంత సేఫ్ సిటీ కోల్ కతా.. మూడో స్థానంలో హైదరాబాద్

Safest city Kolkata: దేశంలో అత్యంత సేఫ్ సిటీ కోల్ కతా.. మూడో స్థానంలో హైదరాబాద్

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 04:04 PM IST

Safest city Kolkata: భారత్ దేశంలో, నేరాల పరంగా, 2022 లో అత్యంత సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో పుణె, మూడో ప్లేస్ లో హైదరాబాద్ నిలిచాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT File)

Safest city Kolkata: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో చోటు చేసుకుంటున్న నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau NCRB) ‘‘క్రైమ్ ఇన్ ఇండియా 2022 (Crime in India 2022)’’ ఒక నివేదిక విడుదల చేసింది. అందులో, 2022 లో దేశంలో అత్యంత సేఫ్ నగరంలో కోల్ కతా అని తేల్చింది. ఎన్సీఆర్బీ రికార్డ్స్ లో కోల్ కతా అత్యంత సురక్షిత నగరంగా నిలవడం వరుసగా ఇది మూడో సంవత్సరం.

ప్రతీ లక్ష జనాభాకు..

కోల్ కతా లో 2022 లో ప్రతీ లక్ష జనాభాకు 86.5 కేసు వేయదగిన నేరాలు (Cognisable crimes) జరిగాయి. ఈ కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే ఐపీసీ, లేదా ప్రత్యేక, లేదా స్థానిక చట్టాల ప్రకారం కేసు వేయదగ్గ నేరాలని అర్థం. కోల్ కతాలో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 103.4 నేరాలు, 2020లో ప్రతీ లక్ష జనాభాకు 129.5 నేరాలు చోటు చేసుకున్నాయి.

హైదరాబాద్ లో..

2022లో పుణెలో ప్రతీ లక్ష జనాభాకు 280.7 కేసు వేయదగిన నేరాలు జరగగా, హైదరాబాద్ లో ప్రతీ లక్ష జనాభాకు 299.2 కేసు వేయదగిన నేరాలు (Cognisable crimes) జరిగాయి. పుణెలో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 256.8 నేరాలు, హైదరాబాద్ లో 2021 లో ప్రతీ లక్ష జనాభాకు 259.9 నేరాలు చోటు చేసుకున్నాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న మొత్తం 19 నగరాల్లోని నేరాలను పరిగణించి, ఎన్సీఆర్బీ (NCRB) ఈ జాబితాను విడుదల చేసింది.

మహిళలపై నేరాలు..

మహిళలపై నేరాలు కోల్ కతాలో 2022 లో పెరిగాయి. ఈ నగరంలో ప్రతీ లక్ష జనాభాకు 2022 లో మహిళలపై 1890 నేరాలు జరగగా, 2021 లో 1783 నేరాలు జరిగాయి. అలాగే, కోల్ కతాలో 2022 లో 34 మర్డర్ కేసులు, 11 రేప్ కేసులు నమోదయ్యాయి.

Whats_app_banner